Ramchander Rao | వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. ప్రజల చెవిలో పువ్వులు పెట్టకండి..
Ramchander Rao | తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. ప్రజలు మా పార్టీని ఆదరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. ప్రజలు మా పార్టీని ఆదరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
జగిత్యాల, భూపాలపల్లి బహిరంగ సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేశారు. ఇద్దరికి భయం ఉన్నది.. వచ్చే ప్రభుత్వం బీజేపీది అని. మాది వస్తే పేరు మార్చుకుంటా అని ఈయన, నువ్వు రావు నేను వస్తానని కలలు కంటున్నారు. వచ్చేది బీజేపీది ప్రభుత్వం మాత్రమే. ప్రజలు ఆలోచిస్తున్నారు.. ఈ రెండు పార్టీలు దగా చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. మార్పు రాలేదు కానీ అప్పు భారం పడ్డది. మోటార్లకు మీటర్లు పెట్టకపోతే.. రూ. 30 వేల కోట్లు ఆపామట.. చర్చకు సిద్ధమా..? ప్రస్తుత సీఎం, మాజీ సీఎంతో చర్చకు సిద్ధంగా ఉన్నాను. రెండున్నర కోట్లలో లక్షన్నర కోట్లు ఇచ్చాం.. అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రజల చెవిలో పువ్వులు పెట్టకండి. మీరు మోటార్లకు మీటర్లు పెట్టి మొత్తం లాగేసుకుంటున్నారు.. తెలంగాణను పీల్చుకుంటున్నారు అని రామచందర్ రావు ధ్వజమెత్తారు.
ప్రజల కాళ్లు మొక్కుతాం.. బీజేపీకి అవకాశం ఇస్తారు
కాళేశ్వరం మీద విచారణ చేయలేదు.. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల మీద విచారణ చేయమని కోరలేదు. మేం కోరితే ఎన్డీఎస్ఏ వారు విచారణ చేశారు. కాళేశ్వరం అవకతవకల మీద మేం మాట్లాడినం.. విచారణ చేయలేదు మీరు. ఓటుకు నోటు కేసులో మిమ్మల్ని రక్షించారు.. ఇప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్‌ను రక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజలతో ఆడుకోకండి.. వాస్తవాలు చెప్పండి.. బీజేపీకి భయపడి ఇద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మీటింగుల్లో పస ఉండదు.. కేవలం బీజేపీని దూషించడానికి మీటింగ్‌లు పెట్టారు.. ఒకరికొకరు రక్షించుకుంటున్నారు. ప్రజల కాళ్లు మొక్కుతాం.. బీజేపీకి అవకాశం ఇస్తారు అని రామచందర్ రావు అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



