Ramchander Rao | తెలంగాణ రాజకీయాల్లో సూపర్ హీరో బీజేపీ: రామచంద్రరావు
Ramchander Rao | తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీజేపీ (BJP) సూపర్ హీరో అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramchander Rao) అన్నారు. రాష్ట్రంలో అసలు భూతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని మండిపడ్డారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీజేపీ (BJP) సూపర్ హీరో అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramchander Rao) అన్నారు. రాష్ట్రంలో అసలు భూతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని మండిపడ్డారు. తాము ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. బీబేపీ తీసుకున్న నిర్ణయాలను ఇరు పార్టీలు కలిసి అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతు పలికింది. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ దక్షిణాదిని తప్పుదోవ పట్టించాడని, చెన్నైలో ఆయన పెట్టిన సమావేశానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి వెళ్లారని విమర్శించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, ఎస్ఐఆర్‌ను ఇద్దరు కలిసి వ్యతిరేకించారు. అన్ని అంశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వారిద్దరే ఉన్నారని చెప్పారు. వాళ్లిదరు ఒకటేనని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణలు ఏంటని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగానే ఆ రెండు పార్టీలు పనిచేస్తాయన్నారు. తమను భూతంలా చూపిస్తున్నారని, తెలంగాణకు అసలు భూతాలు ఆ రెండు పార్టీలేనని చెప్పారు.
తెలంగాణకు మొదటి నుంచి అనుకూలం..
తెలంగాణకు అనుకూలమని బీజేపీ మొదటి నుంచీ చెబుతున్నదని తెలిపారు. తమ పార్టీ మద్దతుతోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్‌ఎస్‌కు ఇద్దరే ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు. ఆ ఇద్దరు ఎంపీలు కూడా ఓటింగ్‌కు హాజరుకాలేదని చెప్పారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ దీ ప్రెస్ కార్యక్రమంలో రామచందర్‌రావు మాట్లాడారు. 12 ఏండ్లు గడిచినా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని దుస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలే..
తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలేదని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులపైనే కేసులు పెట్టారని మివర్శించారు. చాలా ఏండ్లుగా యూనివర్సిటీలు పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయని చెప్పారు. మిగులు నిధులున్న రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పులపాలు చేసిందని మండిపడ్డారు.
కేసీఆర్ సంతకం వల్లే..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రాజెక్టులు-నీళ్లపై ఓ విధానం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టడం తొందరపాటేనన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కర్ణాటకకు సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, నిధులు ఇస్తోందని, తెలంగాణకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఫసల్‌బీమా యోజనను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు
జూన్ 4, 2026

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జూన్ 4, 2026

Tenth Exams | రేపట్నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●S-400 Missiles | భారత్‌కు చేరిన ఎస్-400 నాలుగో యూనిట్.. ఇక మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం
- ●Gemma 4 12B | ల్యాప్‌టాప్‌ల కోసం గూగుల్ కొత్త ఏఐ టూల్.. కంప్యూటర్ లోపల ఉండి పనిచేస్తుంది..
- ●Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు
- ●RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

S-400 Missiles | భారత్‌కు చేరిన ఎస్-400 నాలుగో యూనిట్.. ఇక మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Gemma 4 12B | ల్యాప్‌టాప్‌ల కోసం గూగుల్ కొత్త ఏఐ టూల్.. కంప్యూటర్ లోపల ఉండి పనిచేస్తుంది..

Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



