Big News | ‘బిగ్’ న్యూస్.. సీఎం ఛానల్‌లో ఉద్యోగుల తొలగింపు
Big News | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెందిన ఛానల్‌లో ఉద్యోగుల తొలగించారు. ఒకే సారి 45 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. అప్పటికప్పుడే సమాచారం అందించి, తొలగిస్తున్నట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Big News | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెందిన ఛానల్‌లో ఉద్యోగుల తొలగించారు. ఒకే సారి 45 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు. అప్పటికప్పుడే సమాచారం అందించి, తొలగిస్తున్నట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా తొలగించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కేరళ ఎన్నికలవరకూ ఇక్కడ ఖర్చు తగ్గించుకుంటామని యాజమాన్యం చెప్తున్నట్లు వినికిడి. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ సదరు చానల్ మళయాళం భాషలోనూ ప్రారంభించారు. ఇప్పుడు ఉన్నట్లుండి కీలకమైన తెలుగు చానల్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం చర్చనీయాంశమైంది.
తల్లడిల్లుతున్న కుటుంబాలు
కనీసం నోటీసు లేకుండా, సమాచారం లేకుండా ఒక్కసారిగా 45 మంది ఉద్యోగులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డట్లయింది. దీనిపై ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. జీవనోపాధి కోల్పోవడంతో ఈ మహానగరంలో పూటగడవడమే కష్టంగా ఉంటుందని, అటువంటిది ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు ఎలా భరించాలని లబోదిబోమంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు కేరళ ఎన్నికల నేపథ్యంలో అక్కడ చానల్ ప్రారంభించడం, తదనంతర పరిణామాలతో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మానవతా దృక్పథం లేకుండా, చట్టాలను పాటించకుండా తమ కుటుంబాలను రోడ్డుకీడ్చారని వాపోతున్నారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ





