త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ క‌ప్.. పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన కేటీఆర్

KCR Cricket Cup | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో నిర్వహించబోయే కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.

S

Telangana | Published On Jun 6, 2026, 6.52 pm IST

KCR Cricket Cup | ఆస్ట్రేలియాలో కేసీఆర్ క్రికెట్ క‌ప్.. పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన కేటీఆర్
Advertisement

KCR Cricket Cup | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో నిర్వహించబోయే కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించబడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మలేషియా చేరుకున్న కేటీఆర్‌ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం ప్రత్యేకంగా వెళ్లి కలుసుకున్నారు.

ఈ సందర్భంగా, గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి చేపడుతున్న అనేక కార్యక్రమాలను కేటీఆర్ ప్రశంసించారు. ఇండియన్ కమ్యూనిటీలో ఔన్నత్యాన్ని పెంపొందించుటకై 2023 సంవత్సరంలో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నీకి ఎంతో ఆదరణ లభించిందని అదే ప్రేరణతో ఈ ఏడాది కూడా నిర్వహించ తలపెట్టామని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు ఉప్పు సాయిరాం తెలిపారు.

పార్టీ రజతోత్సవ ఆవిర్భావ సంబరాలను ఈసారి ఆస్ట్రేలియాలో నిర్వహించటానికి పిలుపునిస్తూ త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వస్తానని కేటీఆర్ మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు రాజేష్ రాపోలు, సాయిరాం ఉప్పు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement