Bhogi Festival | ఊరూరా భోగి మంటలు.. రంగురంగుల ముగ్గులతో చూడముచ్చటగా లోగిళ్లు
రాష్ట్రంలో సంక్రాంతి (Sankranti) సందడి మొదలైంది. మూడు రోజులపాటు జరిగే ఈ వేడులకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగను (Bhogi Festival) ఘనంగా జరుపుకుంటున్నారు.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో సంక్రాంతి (Sankranti) సందడి మొదలైంది. మూడు రోజులపాటు జరిగే ఈ వేడులకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగను (Bhogi Festival) ఘనంగా జరుపుకుంటున్నారు. బుధవారం వేకువజామునే ఊరూరా ప్రజలు భోగి మంటలు (Bhogi Mantalu) వేశారు. ఇండ్లలో ఉన్న పాత వస్తువులను మంటల్లో వేసి.. చిన్నా, పెద్ద అంతా కలిసి వాటి చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఆడపడుచులు వాకిళ్లలో రంగురంగుల ముగ్గులలేసి గొబ్బెమ్మలు పెట్టడంతో ప్రతి లోగిలి చూడముచ్చటగా కనిపిస్తున్నది. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలతో గ్రామాలు, కాలనీల్లో కోలాహలం నెలకొన్నది. ఇక సంక్రాంతి వ్యసాయ ఆధారిత పండుగ కావడంతో అన్నదాతలు కాడెద్దులు, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తున్నారు. అమ్మనాన్నమ్మలు తమ మనుమలు, మనుమరాళ్లకు భోగిపండ్లు వేసి స్నానాలు చేయిస్తూ మురిసిపోతున్నారు.

అసలు భోగి అంటే?
భోగి అంటే భోగించడం, అనుభవించడం అని అర్థం. ఈ జీవితానికి ఇది చాలు అని అనిపించేలా మనకు ఏది ఆనందాన్ని అందిస్తుందో దానినే భోగం అంటారు. ఇలాంటి గొప్ప ఆనందాలు సొంతమవ్వాలని, అసంతృప్తి తొలగిపోవాలని, చెడు దృష్టి, నరదృష్టి తొలగిపోవాలని పాత వస్తువులను భోగి మంటల్లో వేసి నూతన క్రాంతికి ఆహ్వానం పలకడమే భోగి పరమార్ధం.

భగ్ అనే సంస్కృత పదం నుంచి 'భోగి' అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనదని అర్ధం. పురాణాల ప్రకారం.. శ్రీరంగనాధ స్వామిలో, గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజున వస్తువు వామనావతరంలో ఐడిని పాఠానికి అణచివేశారు. గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించారని చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | డీ గ్లామర్ లుక్లో అనుపమ – శర్వానంద్ భోగి నుంచి సర్ప్రైజ్ అప్డేట్
ఏప్రిల్ 30, 2026

Sharwanand | యాక్షన్ షెడ్యూల్లో శర్వానంద్ భోగి – పుష్ప 2 సెంటిమెంట్ ప్లేస్లో షూటింగ్
ఏప్రిల్ 14, 2026

Bhogi | ఆగస్టు 28న శర్వా యాక్షన్ డ్రామా..! పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న భోగీ..!
ఫిబ్రవరి 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



