MP Chamala | జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
MP Chamala | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని కోరారు. ఆయన బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
- సీఈసీని వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలి
- ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చకు బీజేపీ ఎందుకు భయపడుతోంది?
- భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్
MP Chamala | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని కోరారు. ఆయన బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని చామల ఆరోపించారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ తప్పులు చేశారని సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు.
50 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామంటున్నారు
‘దేశంలో 50 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని ప్రధాని మోదీ అంటున్నారు. ఎన్నికల వ్యవస్థను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది’ అని చామల ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను ఎన్నుకునే కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చారని అన్నారు. దీనివల్ల ఎన్నికల సంఘం స్వతంత్రత దెబ్బతింటోందని విమర్శించారు. జెన్‌జీ యువత రోడ్డెక్కితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చామల పేర్కొన్నారు. ఢిల్లీలో యువత ఆందోళనకు దిగితే పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు.
ఎంపీల ర్యాలీకి ఆటంకాలు
పార్లమెంట్ మకర ద్వార్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఎంపీలు ధర్నా చేయాల్సిన పరిస్థితిని బీజేపీ తీసుకొచ్చిందని చామల విమర్శించారు. ఎంపీల ర్యాలీకి ఆటంకం కలిగించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. మీడియా ర్యాలీని కవర్ చేయకుండా ఆంక్షలు విధించారని అన్నారు. ఎస్‌ఐఆర్ విషయంలో తప్పు చేయకపోతే పార్లమెంట్‌లో చర్చించేందుకు బీజేపీ ఎందుకు భయపడుతోందని చామల ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!
- ●Stock Markets | జీడీపీ పెరుగుతున్నా.. భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి..?
- ●Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ - ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
- ●UP SIR | యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?
- ●B Vinod Kumar | రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓప్పుకోం
- ●Nabha Natesh | నభానటేష్ కెమిస్ట్రీ - తొమ్మిదేళ్ల తర్వాత మాతృభాషలోకి ఇస్మార్ట్ బ్యూటీ రీఎంట్రీ

HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

Stock Markets | జీడీపీ పెరుగుతున్నా.. భారత స్టాక్ మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి..?

Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ - ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్

UP SIR | యూపీ ఓటరు లిస్టులో కొత్తగా చేర్చిన ఆ 16 లక్షల మంది ఎవరు..?




