త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro | ఎలాంటి చ‌ర్చ లేకుండానే.. హైద‌రాబాద్ మెట్రో స్వాధీనానికి అసెంబ్లీ ఆమోదం

Hyderabad Metro | హైదరాబాద్‌ మెట్రో రైలును ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవడానికి (Hyderabad Metro) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మెట్రో స్వాధీన తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.

G

Telangana | Published On Mar 28, 2026, 5.49 pm IST

Hyderabad Metro | ఎలాంటి చ‌ర్చ లేకుండానే.. హైద‌రాబాద్ మెట్రో స్వాధీనానికి అసెంబ్లీ ఆమోదం
Advertisement

Hyderabad Metro | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌ మెట్రో రైలును ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవడానికి (Hyderabad Metro) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మెట్రో స్వాధీన తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిని స‌భ్యులు ఆమోదించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మెట్రో విస్త‌ర‌ణ‌కు కేంద్ర స‌హ‌క‌రించాల‌న్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులపై సమీక్షించామని, ప్రస్తుతం 69 కిలోమీట‌ర్ల‌ మెట్రో నిర్మాణం జరిగిందని తెలిపారు.

మెట్రో ఫేజ్-2ఏ కింద 76.4 కిలోమీట‌ర్లు, మెట్రో ఫేజ్-2బీ కింద 86.1 కిలోమీట‌ర్ల‌ మేర నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. విస్తరణ కోసమే మెట్రోను స్వాధీనం చేసుకున్నామని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ స‌భ్యుల ఆందోళ‌న‌ల న‌డుమే ఎలాంటి చర్చ లేకుండానే 8 ప‌ద్దుల‌కు శాస‌న స‌భ ఆమోదం తెలిపింది. 2025-26 అదనపు వ్యయ అంచనాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. అనంతరం శాసన సభ వాయిదా పడింది.

కాగా, అసెంబ్లీలో తీర్మానాలను ఏకపక్షంగా ఆమోదించడం సరికాదని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్ రావు విమ‌ర్శించారు. మెట్రో తీర్మానంపై సభలో చర్చించలేదన్నారు. మెట్రో తీర్మాన ఆమోదం ఏకగ్రీవం కాదు.. ఏకపక్షం అంటూ మండిపడ్డారు. మైనింగ్‌ శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నాయ‌ని ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి రూపాయిని కాపాడుకోవాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పార‌ని విమ‌ర్శించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని సీఎం అన్నార‌ని, అది మంత్రి దూరపు బంధువులదని చెప్పార‌న్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లు పొంగులేటి సతీమణి మాధురి, కుమారుడు హర్షరెడ్డి అని చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డికి సతీమణి, కుమారుడు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. రాఘవ అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి పేర‌ని, ఆ సంస్థ అవినీతిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement