త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | కేసీఆర్‌, రేవంత్ ఆస్తుల‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు సిద్ధ‌మా?

Vemula Prashanth Reddy | కేసీఆర్ కుటుంబ ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదని తేలితే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 19, 2026, 2.49 pm IST

Vemula Prashanth Reddy | కేసీఆర్‌, రేవంత్ ఆస్తుల‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు సిద్ధ‌మా?
Advertisement
  • 300 ఎక‌రాలు క‌బ్జా చేయ‌లేద‌ని తేలితే రేవంత్ రాజీనామా చేస్తారా?
  • క‌బ్జా అని తేలితే మేమంతా రాజీనామా చేస్తాం
  • పచ్చ కాంగ్రెసోళ్ల చేతిలో అచ్చ కాంగ్రెసోళ్లు అతలాకుతలం అవుతున్నారు
  • ఆత్మస్తుతి పరనింద తప్ప అసెంబ్లీలో ఏం జరగలేదు
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

Vemula Prashanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ కుటుంబ ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నారా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదని తేలితే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్ర‌శ్నించారు. కబ్జా చేశారని తేలితే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. కేటీఆర్ ఇచ్చిన ఆఫర్ కు రేవంత్ రెడ్డి సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. పచ్చ కాంగ్రెసోళ్ల చేతిలో అచ్చ కాంగ్రెసోళ్లు అతలాకుతలం అవుతున్నారని విమ‌ర్శించారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అసెంబ్లీలో ఏమీ జరగలేదని ఎద్దేవా చేశారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాలు దుశ్శాసన పర్వాన్ని తలపించాయి. ప్రధాన ప్రతిపక్షం గొంతు అసెంబ్లీలో వినిపించకుండా
కుట్ర చేశారు. వన్ సైడ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుకొని ప్రజాస్వామ్యబ‌ద్ధంగా నడిపామని శ్రీధర్ బాబు అంటున్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అసెంబ్లీలో ఏమీ జరగలేదు. 463 పేజీల క్యూర్ బిల్లును అర్ధ గంటలో పాస్ చేశారు. హామీల అమలులో విఫలం అనే టీ షర్టులు వేసుకుంటే తప్పు ఏంటి? రాహుల్ గాంధీ రాతలు, ఫోటోలు ఉన్న టీ షర్టులు వేసుకుని పార్లమెంట్ కు ఎందుకు వెళ్లారు?

దేశంలో అన్ని అసెంబ్లీలు, పార్లమెంట్ సంప్రదాయాలు పాటిస్తాయి. మమ్మల్ని అసెంబ్లీ గేటు వద్ద ఎందుకు ఆపారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు నుములిన పోలీసులపై కేసు ఎందుకు పెట్టలేదు? డీజీపీ ఆటవిక రాజ్యం నడుపుతున్నారు. చావు డప్పు పేరుతో కేసీఆర్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు. రేవంత్ రెడ్డికి పెయిడ్ బ్యాచ్‌లా పోలీసులు మారారు.

రిబ్బన్ రెడ్డిగా మారారు..

మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బీజేపీ వాళ్ల‌ను అసెంబ్లీలో పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి అసెంబ్లీని నడిపించుకున్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ రెడ్డిగా మారారు. కేసీఆర్ ప‌నులు చేస్తే రిబ్బ‌న్ క‌టింగ్‌లు చేసి ప్రారంభిస్తున్న‌డు. బీజేపీతో కుమ్మక్కు అయ్యి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. రేవంత్ రెడ్డి గురువుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు.

భూముల వద్దకు వెళ్ళడానికి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఏం సంబంధం? జణ్వాడా భూముల వద్దకు వెళ్ళడానికి ప్రజా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ భూముల వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను పంపడానికే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.

మన్నే క్రిశాంక్ ఇంటి తాళాలు పగలగొట్టారు.. మీరు పోలీసులా? దొంగలా? రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి బయటకు రావద్దని ఇదంతా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి మొఘల్ చక్రవర్తి, హిట్లర్ లా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ జణ్వాడ భూములు, హరీష్ రావు భూములు ఇప్పుడు కొనుక్కున్నవి కావు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరు.

ల‌క్కీ భాస్క‌ర్ సీఎం..

దానం నాగేందర్ లాగా పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. రేవంత్ రెడ్డి లక్కీ భాస్కర్ సీఎం. పచ్చ కాంగ్రెసోళ్ల చేతిలో అచ్చ కాంగ్రెసొళ్ళు అతలాకుతలం అవుతున్నారు. అచ్చ కాంగ్రెసొళ్ళు రేవంత్ రెడ్డిని మార్చి వేరే సీఎంను పెట్టుకోండి అని వేముల ప్ర‌శాంత్‌రెడ్డి ఫైర‌య్యారు.

Advertisement
Advertisement