త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komati Reddy | దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం : మంత్రి కోమ‌టిరెడ్డి

Komati Reddy | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్‌ నేతల అరెస్టులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

P

Telangana | Published On Oct 7, 2026, 8.20 pm IST

Komati Reddy | దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Komati Reddy | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్‌ నేతల అరెస్టులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటంతో దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం మొదలైందని మంత్రి పేర్కొన్నారు.

స‌మాధానం చెప్ప‌లేక ఆంక్ష‌లు..

రాహుల్‌ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే బీజేపీ దేశ రాజధానిలో ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ఆంక్షలు బీజేపీ పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనదని, అయితే బీజేపీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈసీ కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు, కాంగ్రెస్‌ శ్రేణుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమన్నారు.

పోరాటం ఆపేది లేదు

ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, పోలీసు బలగాలతో నిర్బంధాలు విధించినా ప్రజల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఆపేది లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంస్థల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్‌ గాంధీ నాయకత్వంలో జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement