Excise officer | ఆకలితో నైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం
చేతకాని, చావలేని , చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడ లేడని చాలా సార్లు అనిపించింది. నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాను. వారికి ఎప్పటికి బుుణపడి ఉంటాను. ఇక నేను ఇక్కడ ఇమడ లేనని పూర్తిగా అర్ధం అయ్యింది.అరేయ్, ఓరేయ్, వెధవ, ఇడియట్, యూసిలెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా , దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్నన్న అధికారులకు, మిత్రులకు మరియు ఇతర అధికారులకు నమస్కారం!
సోమిరెడ్డి, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ, నిజామాబాద్ డివిజన్
సంక్షిప్త సారాంశం
10 నిమిషాలు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి చదివాడు. నా జీవితం లో ఎన్నడు ఎదుర్కోని ఘోర అవమానం చేసాడు. నాతోనే , నేను వెధవను అనిపించేలా ప్రయత్నం చేసాడు. అదే గదిలో నలుగురు అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యథకు గురి చేసింది. అయినా తట్టుకున్నాను. బయటకు వచ్చి విషయం మిత్రులకు, అధికారులకు చెప్పాను. అలా ఎలా మనల్ని అంటాడని అందరికి చెప్పాను. ప్రశ్నిద్దాం అని చెప్పాను.
ఆకలితో నైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం
అంతమంది ముందు..నన్ను ఇడియట్ అంటే తట్టుకోలేకపోయాను
ఓ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బహిరంగ లేఖ
త్రినేత్ర.న్యూస్
ఉన్నతాధికారులకు, మిత్రులకు,
ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు!
ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉంది.
మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు!
నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడ లేడని చాలా సార్లు అనిపించింది. నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాను. వారికి ఎప్పటికి బుుణపడి ఉంటాను. ఇక నేను ఇక్కడ ఇమడ లేనని పూర్తిగా అర్ధం అయ్యింది. చేయని తప్పుకి “ వెధవ , ఇడియట్” అన్నప్పుడు నాలో సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేక పోయింది. నేను ఒక్కటే మాట ఎదురు చెప్పాను, “అలాంటి మాట అనొద్దు సార్ “ అని మాత్రమే . నేను ఎదురు చెప్పిన ఆ చిన్న మాటకు కమీషనర్ గారి ఈగో హర్ట్ అయిందనుకుంటా! ఎవరూ ఎన్నడు ఎదురు చెప్పి ఉండరు కదా!
నా సిబ్బంది ముందే..నన్ను
“10 నిమిషాలు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి చదివాడు. నా జీవితం లో ఎన్నడు ఎదుర్కోని ఘోర అవమానం చేసాడు. నాతోనే , నేను వెధవను అనిపించేలా ప్రయత్నం చేసాడు. అదే గదిలో నలుగురు అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యథకు గురి చేసింది. అయినా తట్టుకున్నాను.
బయటకు వచ్చి విషయం మిత్రులకు, అధికారులకు చెప్పాను. అలా ఎలా మనల్ని అంటాడని అందరికి చెప్పాను. ప్రశ్నిద్దాం అని చెప్పాను.
కమీషనర్ అవమానించిన దాని కన్నా కూడా అన్యాయాన్ని ప్రశ్నిద్దాం... అన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారుల మరియు మిత్రుల భయం , మౌనం నన్ను బాగా కలచి వేసింది. అక్కడే కుప్పకూలి పోయాను. మిత్రులు హాస్పిటల్ కు చేర్చారని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరపున కృతజ్ఞతలు 🙏
అరేయ్, ఓరేయ్, వెధవ, ఇడియట్, యూసిలెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా , దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్నన్న అధికారులకు, మిత్రులకు మరియు ఇతర అధికారులకు నమస్కారం!
నేను పెరిగిన వాతావరణంలో
ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితం అని నమ్మాను.
“*ఆకలితో నైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం”
అన్న కాళోజి మాటలు యాది చేసుకుంటూ..చేతకాని, చావలేని , చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులతో చర్చించాను, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను (ఉద్యోగం) వీడివెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన , నాకు సహకరించిన ఉన్నతాధికారులకు మిత్రులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు. 🙏
ఇట్లు
సోమిరెడ్డి
డిప్యూటీ కమీషనర్
నిజామాబాద్ డివిజన్.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





