Kavitha | బ్యాక్‌డోర్‌లో బ్యాక్‌లాగ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ : మాజీ ఎమ్మెల్సీ కవిత
Kavitha | బ్యాక్ డోర్ మార్గంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొడుతున్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని పలువురు నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చారని కవిత తెలిపారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీకి జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉందని, ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి అనేక మంది యువకులు హైదరాబాద్‌కు వచ్చి శిక్షణ పొందుతున్నారని, వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ తీసుకుంటున్నారన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి యువత ఉద్యమంలో బలంగా పోరాడిందని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్నపాటి ఉద్యోగాలే వచ్చాయని విమర్శించారు. ఒక క్రమపద్ధతిలో పరీక్షలు నిర్వహించలేదని, ఒకే రోజు రెండు పరీక్షలు పెట్టడం వల్ల అనేక మంది అవకాశాలు కోల్పోయారని తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే న్యాయం జరుగుతుందని యువత భావించిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించిందని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందని యువత నమ్మిందని, కానీ ఇప్పటికీ ఏ నెలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో స్టేట్ లెవల్ పోస్టులకు కూడా ‘ప్రొవిజన్’ అనే పదాన్ని ఉపయోగించి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. లక్షన్నర జీతం ఉన్న ఉద్యోగాలు బోయినపల్లి సరితతో పాటు పలువురికి వచ్చినట్లు విన్నామని, ఆ అన్యాయంపై తీవ్రంగా బాధపడ్డామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో జిల్లా స్థాయిలో ఉన్న 44 పోస్టులను పది నుంచి 15 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఘటనలు చోటు చేసుకున్నాయని, యువత పోరాటంతో ఆ రిక్రూట్‌మెంట్లను ఆపేశారని తెలిపారు. అయితే అప్పట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వారు ఇంకా కొనసాగుతున్నారని, వారికి న్యాయం జరగలేదని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఈ రాజకీయాలను యువత గమనించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో మరోసారి ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్‌లాగ్ పోస్టులేనని, గతంలో భర్తీ చేయకుండా మిగిలిపోయినవని చెప్పారు. అయితే ఈ పోస్టులను కూడా గతంలో మాదిరిగానే అమ్ముకునే అవకాశం ఉందన్న భయం యువతలో ఉందని కవిత పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పైరవీలతో పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ సహా పలు జిల్లాల నుంచి యువత తన వద్దకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో పోస్టులు అమ్ముకున్న విషయం కొన్ని చోట్ల రుజువైందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వం ముందే కళ్లుతెరచి అధికారులకు కఠిన హెచ్చరికలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పరిధిలోని ఉద్యోగాలు కలెక్టర్లు మెరిట్ ఉన్న అభ్యర్థులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయవద్దని సూచించారు. దేవుని దయతో తాము అధికారంలోకి వస్తే డబ్బులు తీసుకున్నవారిని, ఇచ్చినవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నాలు చేయకుండా మెరిట్ ఉన్నవారికి అవకాశాలు రావాలని, మెరిట్‌తో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడే సీరియస్‌గా దృష్టి పెట్టి విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



