Alcohol Ban | ఆ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం.. 18 ఏండ్లలోపు వారికి సిగరెట్ల అమ్మకాలపై కూడా..
Alcohol Ban | పొద్దంతా కష్టం చేసి వచ్చిన డబ్బును సాయంత్రం మద్యం (Alcohol) దుకాణంలో పోస్తున్నారు. పూటుగా తాగివచ్చి ఇంట్లో గొడవలు పడుతున్నారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
Alcohol Ban | త్రినేత్ర.న్యూస్: పొద్దంతా కష్టం చేసి వచ్చిన డబ్బును సాయంత్రం మద్యం (Alcohol) దుకాణంలో పోస్తున్నారు. పూటుగా తాగివచ్చి ఇంట్లో గొడవలు పడుతున్నారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీనికితోడు యువత మద్యానికి బానిసై పెడదోవ పడుతున్నారు. మత్తుకు అలవాటుపడి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో మద్యపానంపై నిషేధం (Alcohol Ban) విధిస్తున్నారు. తాగినా, అమ్మినా పెద్దమొత్తం జరిమానా వసూలు చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దలోడి (లోనికలాన్)లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం విధించారు.
సర్పంచ్ హన్మంత్ రాజు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. అదేవిధంగా 18 ఏండ్ల లోపు వారికి సిగరెట్లు కూడా అమ్మవద్దని తీర్మానించారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా అమ్మినా పోలీసులకు సమాచారం అందించడంతోపాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలో బెల్ట్‌షాపులతో యువత చెడిపోతున్నారని, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని సర్పంచ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు మద్యపానం నిషేధిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మద్యపాన నిషేధానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాల్లో మద్యపానంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అమ్మినవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..
మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్, డీ. ధర్మారం, వెంకటాపూర్, కొల్చారం, సిద్దిపేట జిల్లా అక్బర్ పేట, బొప్పాపూర్ గ్రామపంచాయతీల్లో మద్యాన్ని నిషేధిస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేశాయి. గ్రామాల్లో అన్ని బెల్ట్ షాప్‌లు మూసివేయాలని నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లా బొప్పాపూర్‌లో బెల్ట్ షాప్ నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ.ధర్మారంలో మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.10 వేల నజరాన ఇవ్వనున్నారు. కొన్ని చోట్ల 18 ఏండ్ల లోపువారికి గుట్కా, సిగరెట్లు అమ్మొద్దని తీర్మానించారు.
సంబంధిత వార్తలు

Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్
అక్టోబర్ 1, 2026

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
సెప్టెంబర్ 29, 2026

Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక
- ●Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్
- ●Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు
- ●Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
- ●Telangana CEO Form 6 Declaration | ఓటర్లకు సీఈవో కీలక ఆదేశాలు: ఆ ఒక్కటి లేకుంటే ఓటు కట్
- ●Gadwal Vijayalakshmi Cabinet Meeting | సచివాలయంలో కేబినెట్ హాల్లోకి గద్వాల విజయలక్ష్మికి నో ఎంట్రీ.. సీఎంవో అధికారుల సమాధానంతో షాక్

Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక

Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్

Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు

Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!



