TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్
TG SAFE | హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్ మెస్‌లలో ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 4 హోటళ్ల లైసెన్సులు (FSSAI Licence) రద్దు చేశారు.
TG SAFE | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్ మెస్‌లలో ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 4 హోటళ్ల లైసెన్సులు (FSSAI Licence) రద్దు చేశారు. వ్యాపారాలను నిలిపివేయాలని ఆదేశించారు. పలు హోటళ్లకు నోటీసులు జారీచేశారు.
నగరంలోని 13 హోటళ్లు, క్యాంటీన్లలో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో చిక్కడపల్లిలోని ఎన్ఆర్ఎస్ నందిని సుధ, వెంగళరావునగర్‌లోని సాయి దర్శిని, యూనివర్సల్ రెస్టారెంట్‌తోపాటు అమీర్‌పేటలోని హర్ష డీలక్స్ మెస్ ఫాసీ (FSSAI) లైసెన్సులు రద్దు చేశారు. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు.

అపరిశుభ్ర వంటగదులు, జిడ్డు పట్టిన గోడలు, చిమ్నీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఆహార వ్యర్థాలు, నిల్వ ఉన్న నీటిని అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఫ్రిజ్‌లలో శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట అపరిశుభ్రంగా నిల్వ చేయడం, వంటచేసే సిబ్బంది హెయిర్ నెట్స్, గ్లౌజ్‌లు, తగిన దుస్తులు ధరించకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, సిబ్బంది వైద్య పరీక్షల (హెల్త్ రికార్డ్స్) వివరాలు లేకపోవడం వంటివి గుర్తించారు. ఆహార కల్తీ అనుమానంతో 16 నమూనాలు సేకరించారు.

ఫాసీ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న పద్మశ్రీ క్యాంటీన్‌ను మూసివేయాలని ఆదేశించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని అబ్సల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్‌కు లోపాలు సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీచేశారు. ఇక నిబంధనలు పాటించిన హఫీజ్‌పేటలోని ఇంపీరియల్ మల్టీకుజిన్, మాదాపూర్‌లోని కోల్‌కతా హౌస్, ఆవునా రెస్తారెంట్, రాజుగారి బిర్యాని, అమీర్‌పేటలోని ఆనందోబ్రహ్మ రెస్టారెంట్, రాయలసీమ రుచులు రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆయా సంస్థలు నిబంధనలు పాటిస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు టీజీ సేఫ్ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..
- ●CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా
- ●Stock Markets | స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల జోరు..
- ●TOMCOM | ఖతార్‌లో నర్సు ఉద్యోగాలు.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న TOMCOM

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..

CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా






