త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sampath Kumar | కేటీఆర్‌ను ప్ర‌జ‌లే ఛీ కొడుతారు : ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్

Sampath Kumar | సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్ర‌జ‌ల‌కే ఛీ కొడుతార‌ని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్ కుమార్ అన్నారు. కేటీఆర్ విష‌యంలో సీఎం రేవంత్ ఎంతో ఓపిక‌గా ఉంటున్నారు.. ఇంత ఓపిక‌గా ఉంటున్న ముఖ్య‌మంత్రికి దండం పెట్టాల‌న్నారు.

S

Telangana | Published On Mar 10, 2026, 3.56 pm IST

Sampath Kumar | కేటీఆర్‌ను ప్ర‌జ‌లే ఛీ కొడుతారు : ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్
Advertisement

కేటీఆర్‌వి నీచ రాజ‌కీయాలు..
సీఎం రేవంత్ మాట‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారు..
ఓపిక‌గా ఉన్న సీఎంకు దండం పెట్టాలి..
ఆర్థిక ప‌రిస్థితిని చిన్నాభిన్నం చేసింది కేసీఆరే

Sampath Kumar | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్ర‌జ‌ల‌కే ఛీ కొడుతార‌ని ఏఐసీసీ కార్య‌ద‌ర్శి సంప‌త్ కుమార్ అన్నారు. కేటీఆర్ విష‌యంలో సీఎం రేవంత్ ఎంతో ఓపిక‌గా ఉంటున్నారు.. ఇంత ఓపిక‌గా ఉంటున్న ముఖ్య‌మంత్రికి దండం పెట్టాల‌న్నారు. గాంధీ భ‌వ‌న్‌లో సంప‌త్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీష్ బంధు, సంతోష్ బంధు, క‌విత బంధు ఉండేది. చిల్లర రాజకీయాలు చేయడం కేటీఆర్ మానుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట. నిజాలను అబద్ధాలుగా మార్చడం కేటీఆర్‌కి అలవాటు. కేటీఆర్ అబద్ధాలను నిజాలుగా వక్రీకరిస్తున్నారు. కేటీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. మీడియాకి హెడ్ లైన్స్ కోసమే కేటీఆర్ తాపత్రయం. విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. పచ్చి అబద్ధాలను కేటీఆర్ ప్రజలపై రుద్దుతున్నార‌ని సంప‌త్ కుమార్ మండిప‌డ్డారు.

ప్రధానికి మనుమడు, ఇంకో ప్రధానికి కొడుకు అయిన రాహుల్‌కి సొంత ఇల్లు లేదు. రాహుల్‌కి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే రూ. 1000 కోట్లు అవుతాయని రేవంత్ అన్నాడు. సీఎం మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రభుత్వ పైసలను దుబారా చేశారు. గవర్నమెంట్ సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసేందుకు వేరే రాష్ట్రాల వారిని విమానంలో రప్పించారు. కేసీఆర్ ఫోజులు కొట్టేందుకు తెలంగాణ పైసలను పంజాబ్‌లో పంచారు. ఆర్ధిక పరిస్థితిని కేసీఆర్ చిన్నాభిన్నం చేశార‌ని సంప‌త్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement