Sangareddy | బైక్ కొనివ్వలేదని.. భార్యకు ఉరేసి భర్త బలవన్మరణం
Sangareddy | అత్తింటి వారు బైక్ కొనివ్వలేదన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యకు చున్నీతో ఉరేసుకుని, తాను మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
Sangareddy | త్రినేత్ర.న్యూస్ : అత్తింటి వారు బైక్ కొనివ్వలేదన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యకు చున్నీతో ఉరేసుకుని, తాను మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి శివారులోని మామిడితోటలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య(25)కు యాదమ్మ(20)తో 11 నెలల క్రితం పెళ్లైంది. భార్య, తల్లి, సోదరుడితో కలిసి మారేపల్లి శివారులోని ఓ మామిడితోటను కౌలుకు తీసుకున్నారు. అక్కడే నివాసం ఉంటూ మామిడి పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే కట్నంలో భాగంగా బైక్ కూడా కొనిస్తామని అత్తింటి వారు అంజయ్యకు ప్రామీస్ చేశారు. కానీ అది నెరవేరలేదు. వివాహమై 11 నెలలు కావొస్తున్నప్పటికీ బైక్ ఇప్పించకపోవడంతో.. భార్యతో తరుచుగా గొడవపడేవాడు అంజయ్య.
ఈ గొడవ శుక్రవారం మరింత ముదిరింది. ఆగ్రహావేశాలకు లోనైన అంజయ్య భార్య యాదమ్మకు చున్నీతో ఉరేశాడు. అనంతరం తమ కుటుంబం కాపలా ఉంటున్న మామిడి తోటలో ఉరేసుకున్నాడు అంజయ్య.
సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్యగౌడ్ ఘటనా స్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. యాదమ్మ తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






