Suicide | పెళ్లైన మరుసటి రోజే పెళ్లాన్ని కొట్టి.. మనస్తాపంతో ఉరేసుకున్న నవ వరుడు
Suicide | మూడు ముళ్లు.. ఏడడుగులు వేసి మూడు రోజులు కూడా కాలేదు. ఆలోపే నవ దంపతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో నవ వధువును కొట్టాడు. ఆ తర్వాత మనస్తాపంతో నవ వరుడు ఉరేసుకున్నాడు.
Suicide | త్రినేత్ర.న్యూస్ : మూడు ముళ్లు.. ఏడడుగులు వేసి మూడు రోజులు కూడా కాలేదు. ఆలోపే నవ దంపతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో నవ వధువును కొట్టాడు. ఆ తర్వాత మనస్తాపంతో నవ వరుడు ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలోని నర్వ మండలంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నర్వ మండల కేంద్రానికి చెందిన చాకలి గోవిందమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు చాకలి రవికి కర్నూల్ నగరానికి చెందిన యువతితో ఈ నెల 20న వివాహమైంది. 21వ తేదీన ఇరువురు దంపతులు గొడవపడ్డారు. క్షణికావేశంలో ఆగ్రహంతో భార్యను కొట్టడంతో.. ఆమె కుప్పకూలింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. నవ వధువును చికిత్స నిమిత్తం నర్వ పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈలోపే విషయం వధువు కుటుంబ సభ్యులకు తెలిసింది. నర్వకు వచ్చిన వారు వరుడి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అనారోగ్యం బారిన పడిన వధువును కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవి సోమవారం ఉదయం 6 గంటలకు పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవ వరుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసే వరకు పోరాటం ఆపం : శ్రీనివాస్ గౌడ్
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



