Chamala Kirankumar vs Palla Rajeshwar Reddy | పల్లాపై ఎంపీ చామల ప్రశ్నల వర్షం.. సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఈ సీన్ జరిగిందిక్కడే
Chamala Kirankumar vs Palla Rajeshwar Reddy | సిద్దిపేట జిల్లా చేర్యాల (Cheryal) పట్టణంలో పెన్షన్ (Pentions) మంజూరు పత్రాల పంపిణీ రసాభాసగా మారింది. రేణుక గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy), భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Kirankumar Reddy) వాగ్వాదం చోటుచేసున్నట్లు సమాచారం.
- పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీలో గందరగోళం
- చేర్యాల పట్టణంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం
Chamala Kirankumar vs Palla Rajeshwar Reddy | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట జిల్లా చేర్యాల (Cheryal) పట్టణంలో పెన్షన్ (Pentions) మంజూరు పత్రాల పంపిణీ రసాభాసగా మారింది. రేణుక గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy), భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Kirankumar Reddy) వాగ్వాదం చోటుచేసున్నట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఎంపీ చామల పల్లాను నిలదీశారు. ఈ సమయంలో కార్యకర్తలకు దండం పెడుతూ పల్లా సైలెంట్‌గా ఉండడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గందరగోళ పరిస్థితుల మధ్యనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తూ నిలదీశారు. గత పాలనలో జరిగిన పరిణామాలకు సంబంధించి సమాధానం చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఎంపీ సంధించిన ప్రశ్నలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలిసింది. ఈ సమయంలో పోలీసులు వచ్చి పరిస్థితులను చక్కదిద్దారు.
లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందించే వేదికపై రాజకీయ రగడ చోటుచేసుకోవడం చేర్యాల రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సంక్షేమ కార్యక్రమంలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్



