త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | 50 శాతం ధాన్యం క‌ల్లాల్లోనే ఉంది.. మంత్రులు తిరిగితే తెలుస్త‌ది: బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy | రాష్ట్రంలో వరి ధాన్యం 50 శాతం కల్లాలోనే ఉందని.. జిల్లా ఇంచార్జ్ మంత్రులు కల్లాల్లో తిరిగితే తెలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈనెల 31 లోపు రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 24, 2026, 2.45 pm IST

Jeevan Reddy | 50 శాతం ధాన్యం క‌ల్లాల్లోనే ఉంది.. మంత్రులు తిరిగితే తెలుస్త‌ది: బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి
Advertisement
  • నిన్నటి కేబినెట్ స‌మావేశంలో ధాన్యం కొనుగోలుపై మాట్లాడ‌నే లేదు
  • 31 లోపు ధాన్య‌మంతా కొనాలే.. లేదంటే సీఎంకు జూన్ 2న జెండా ఎగ‌రేసే అర్హ‌త లేన‌ట్టే
  • ఒక్కో రైతు క్వింటాల్ కు 250 రూపాయలు నష్టపోతున్నాడు
  • కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడు కరీంనగర్ రాలే
  • రేవంత్ ప్ర‌భుత్వ తీరు వీణ కాసి నక్కల పాలైనట్లుంది
  • రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం మొదలైంది
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో వరి ధాన్యం 50 శాతం కల్లాలోనే ఉందని.. జిల్లా ఇంచార్జ్ మంత్రులు కల్లాల్లో తిరిగితే తెలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వన్‌లో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. ఈనెల 31 లోపు రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే జూన్ 2న జెండా ఆవిష్కరణ చేసే నైతికత రేవంత్ రెడ్డికి ఉండ‌ద‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు చూస్తుంటే వీణ కాసి నక్కల పాలైనట్లు ఉందని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ మోసం చేశాడు..

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం వరి ధాన్యం కొనుగోలు అంశం. ధాన్యం కొనుగోలు అంశంపై నిన్నటి కేబినెట్ లో చర్చనే చేయ‌లేదు. వరి ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఒక్కో రైతు క్వింటాల్ కు 250 రూపాయలు నష్టపోతున్నాడు. క్వింటాల్ కు 250 రూపాయలు R&R ట్యాక్స్ గా పరిగణించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఘోరంగా మోసం చేస్తుంది. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ రైతులను మోసం చేశాడు. కేసీఆర్ హయాంలో రైతులకు పంటకు పంటకు రైతుబంధు వస్తుండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ రైతు భరోసా ఇచ్చే దిక్కు లేదు అని ఆయ‌న‌ విమ‌ర్శించారు.

కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడు కరీంనగర్ రాలేదు. ధాన్యం కొనుగోలుపై రివ్యూ చేయ‌లేదు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల నిర్వహణ, ఫుట్ బాల్ పోటీల నిర్వహణ చేసుకోవడమే సరిపోయింది. రైతుల సమస్యలపై రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క రివ్యూ చేయ‌లేదు. ధాన్యం కొనుగోలు చెయ్యండని రైతులు వేడుకుంటున్నారు. ఎండ తీవ్రతకు ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నారు. అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

సీఎంకు అందాల పోటీల మీదున్న శ్ర‌ద్ధ రైతుల‌పై లేదు..

వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న రాష్ట్రం తెలంగాణ. మొక్క జొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అందాల పోటీల పై ఉన్న శ్రద్ధ జ రైతుల పై లేదు. ఫ్యూచర్ సిటీ పేరుతో అందరిని మభ్య పెడుతున్నారని, ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూములను ఫార్మా కంపెనీలకే ఇస్తామని హరీష్ రావు అంటే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై మంత్రి శ్రీధర్ బాబు ఉలిక్కి పడుతున్నాడు. ఫార్మా సిటీ భూములను రేవంత్ రెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని జీవ‌న్‌రెడ్డి ఆరోపించారు.

మంత్రులు హైద‌రాబాద్‌కే ప‌రిమితం..

గత ప్రభుత్వం వరి ధాన్యం ఏ విధంగా చేపట్టిందో, క‌నీసం అది చూసి కూడా ఈ ప్రభుత్వం నేర్చుకోలేదు. ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కనిపిస్తుంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు పూర్తిగా విఫల‌మ‌య్యారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇప్పటికైనా జిల్లా ఇంచార్జ్ మంత్రులు కల్లాల్లో తిరిగితే తెలుస్తుంది అని హిత‌వు ప‌లికారు.

బాధిత రైతు కుటుంబాల‌కు రూ. కోటి ప‌రిహారం ఇవ్వాలి..

బీఆర్ఎస్ అధికారంలోకి రాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల పెడితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో రాదో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు ఎదురుస్తున్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ప్రజల్లో మొదలైంది. దినం గడపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వ తీరు ఉంది. యూరియా కోసం యాప్ పెట్టారు, పని చెయ్యని యాప్ రైతులకు ఏం అవసరం ఉంటుంది. ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతుల మరణాల‌న్నీ ప్రభుత్వ హత్యలే. మరణించిన రైతు కుటుంబాల‌కు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి అని జీవ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement