Chicken Piece | 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్న కోడి కూర ముక్క
Chicken Piece | కోడి కూర ముక్క ఓ 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గొల్లపల్లిలో చోటు చేసుకుంది.
Chicken Piece | రాజన్న సిరిసిల్ల : కోడి కూర ముక్క ఓ 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గొల్లపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి సురేందర్(45) తన కుటుంబ సభ్యులతో కలిసి గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూనే ఇంటి దగ్గర ఓ కిరాణం షాపును కూడా నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి కోడి కూర తింటుండగా.. సురేందర్ గొంతులో ఓ ముక్క ఇరికింది. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. బాధితుడి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను బయటకు తీసేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. కాసేపటికే సురేందర్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే సురేందర్ కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. సురేందర్‌కు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు రుచిత, శిరీష ఉన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




