త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ration Rice | తెలంగాణ‌లో 42 వేల క్వింటాళ్ల రేష‌న్ బియ్యం మాయం

Ration Rice | తెలంగాణ‌లో 42 వేల క్వింటాళ్ల ధాన్యం మాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రైస్ మిల్ల‌ర్ల‌పై విజిలెన్స్ అండ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

S

Telangana | Published On Oct 23, 2026, 1.54 pm IST

Ration Rice | తెలంగాణ‌లో 42 వేల క్వింటాళ్ల రేష‌న్ బియ్యం మాయం
Advertisement

దృష్టిసారించిన విజిలెన్స్ అండ్ టాస్క్‌ఫోర్స్

Ration Rice | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లో 42 వేల క్వింటాళ్ల ధాన్యం మాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రైస్ మిల్ల‌ర్ల‌పై విజిలెన్స్ అండ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ క్ర‌మంలోనే ఇబ్రంహీంప‌ట్నంలోని ఓ రైస్‌మిల్లులు త‌నిఖీలు చేప‌ట్టారు. విచార‌ణ‌లో సిద్దిపేట‌కు చెందిన మ‌రో రైస్ మిల్లు య‌జ‌మాని పేరు వెలుగులోకి వ‌చ్చింది. అక్క‌డ త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఈ భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. ఒక‌ట్రెండు కాదు ఏకంగా 42 వేల క్వింటాళ్ల రేష‌న్ బియ్యం మాయమైన‌ట్లు స‌మాచారం. రేష‌న్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో విక్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది.

సిద్దిపేట మోతెకు చెందిన భార‌తి ఇండ‌స్ట్రీస్ యాజ‌మాన్యం అక్ర‌మ రేష‌న్ దందా చేప‌ట్టిన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. మొత్తానికి ఆ రైస్ మిల్లు యాజ‌మాన్యంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. దీంతో భార‌తి ఇండ‌స్ట్రీస్ యాజ‌మాన్యం ప‌రారీలో ఉంది.

Advertisement
Advertisement