త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Prajavani | సీఎం ప్ర‌జావాణికి స్పంద‌న‌.. 379 ద‌ర‌ఖాస్తులు..!

CM Prajavani | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం 219వ సీఎం ప్రజావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మొత్తం 379 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

P

Telangana | Published On May 5, 2026, 7.15 pm IST

CM Prajavani | సీఎం ప్ర‌జావాణికి స్పంద‌న‌.. 379 ద‌ర‌ఖాస్తులు..!
Advertisement

CM Prajavani | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం 219వ సీఎం ప్రజావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మొత్తం 379 దరఖాస్తులు వ‌చ్చాయ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 103 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు 66 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 105 దరఖాస్తులు, ప్రవాసి ప్రజావాణికి రెండు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇతర శాఖలకు సంబంధించి 103 దరఖాస్తులు వచ్చాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలను విని సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్య ప్రకాశ్‌, ఏసీపీ ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement