త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Road Accident | మెద‌క్ జిల్లా కొల్చారం మండ‌ల ప‌రిధిలోని రాంపూర్ వ‌ద్ద శ‌నివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Mar 14, 2026, 5.30 pm IST

Road Accident | మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : మెద‌క్ జిల్లా కొల్చారం మండ‌ల ప‌రిధిలోని రాంపూర్ వ‌ద్ద శ‌నివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులంద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వార‌ని పోలీసులు తెలిపారు. మృతులను హ‌వేలి ఘ‌న్‌పూర్ మండ‌లంలోని బూరుగుప‌ల్లి వాసులుగా గుర్తించారు. మృతుల‌ నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ అతి వేగం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని తేలింది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Advertisement
Advertisement