Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు
Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు (Junior Civil Courts) ఏర్పాటు కానున్నాయి. కింది కోర్టుల్లో భారీగా పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో న్యాయ మూర్తులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
Junior Civil Courts | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు (Junior Civil Courts) ఏర్పాటు కానున్నాయి. కింది కోర్టుల్లో భారీగా పెండింగ్ కేసులు పేరుకుపోవడంతో న్యాయ మూర్తులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా కొత్తగా 200 అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను (First class Magistrate) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 594 కొత్త కోర్టులను మంజూరు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదనలు పంపింది. పరిశీలించిన ప్రభుత్వం, తొలి విడతగా 200 కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బీ.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్షక్షిదారులకు కోర్టులను మరింతగా చేరువ చేయడం, ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పని భారాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని అందులో పేర్కొన్నారు.
కేసులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్న పట్టణ ప్రాంతాల్లోనే కొత్త కోర్టులను ఎక్కువగా కేటాయించారు. హైదరాబాద్ (Hyderabad) మెట్రోపాలిటన్ పరిధిలోనే 71 కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా కోర్టు పరిధిలో రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, హయత్‌నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగళ్లు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 30, మేడ్చల్ జిల్లాలో 25 , హైదరాబాద్ జిల్లాలో 16 చొప్పున ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో 10, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో 8 కోర్టులు కేటాయింపు జరిగింది.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
సెప్టెంబర్ 26, 2026

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 25, 2026

Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!
- ●Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- ●Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం
- ●Sawan Barwal | 44 ఏండ్లలో తొలిసారి.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్

iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..

వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు



