త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో కొన‌సాగుతున్న‌ ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఈ మార్గాల్లో సాధార‌ణ వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాలు (Ganesh Immersion) ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. శ‌నివ‌రాం మ‌ధ్యాహ్నం వ‌రకు ఈ ప్ర‌క్రియ ముగిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు.

G

Hyderabad | Published On Sep 26, 2026, 8.12 am IST

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో కొన‌సాగుతున్న‌ ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఈ మార్గాల్లో సాధార‌ణ వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాలు (Ganesh Immersion) ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. శ‌నివ‌రాం మ‌ధ్యాహ్నం వ‌రకు ఈ ప్ర‌క్రియ ముగిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ నేప‌థ్యంలో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్ప‌ష్టం చేశారు. అందువ‌ల్ల వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు. కాగా, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో గ‌ణేశ్ నిజ‌మ‌జ్జ‌నాలు కొన‌సాగుతున్నాయ‌ని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజల‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ చీఫ్ వీసీ స‌జ్జ‌నార్ (VC Sajjanar) ఎక్స్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

`గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.

ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా పోలీసు, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ఇప్పటికే విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నాం. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా మాకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.` అని సీపీ స‌జ్జ‌నార్ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement