Sawan Barwal | 44 ఏండ్లలో తొలిసారి.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్
Sawan Barwal | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్ (Sawan Barwal) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా శనివారం జరిగిన మారథాన్ ఫైనల్‌లో (Marathon Final) రెండో స్థానంలో నిలిచి రజత పతకం (Silver Medal) సాధించాడు.
Sawan Barwal | త్రినేత్ర న్యూస్: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్ (Sawan Barwal) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా శనివారం జరిగిన మారథాన్ ఫైనల్‌లో (Marathon Final) రెండో స్థానంలో నిలిచి రజత పతకం (Silver Medal) సాధించాడు. దీంతీ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ అందించాడు. ఈ విజయంతో సవాన్ తన వ్యక్తిగత రికార్డును తిరగరాస్తూ.. 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్లలో రోటర్‌డామ్ మారథాన్‌ను పూర్తిచేశాడు. తద్వారా తన కెరీర్‌లో బెస్ట్ టైమింగ్‌ను నమోదుచేశాడు. ఈ రేసులో జపాన్‌కు చెందిన ఇచిటాకా యామాషితా (2:10:49) స్వర్ణ పతకం సాధించగా, చైనాకు చెందిన పీయూ ఫెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
కాగా, ఆసియా క్రీడల మారథాన్ విభాగంలో భారత్‌కు (India) పతకం దక్కడం గత 44 ఏండ్లలో ఇదే తొలిసారి. చివరగా 1982 ఢిల్లీ ఆసియా గేమ్స్‌లో హొసూర్ కుకప్ప సీతారాం కాంస్య పతకం (Bronze) సాధించారు. తాజాగా సవాన్ రజతంతో ఇన్నేండ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతానికి చెందిన సవాన్ బర్వాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన రోటర్‌డామ్ మారథాన్‌లో 48 ఏండ్ల నాటి శివనాథ్ సింగ్ జాతీయ రికార్డును బద్దలు కొట్టి మొదటిసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆసియా గేమ్స్ వేదికపై మరోసారి తన రికార్డును మెరుగుపరుచుకుంటూ రజత పతకంతో మెరిశాడు. 2019లో సైన్యంలో చేరిన సవాన్.. బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూప్‌లో హవిల్దార్‌గా సేవలు అందిస్తున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- ●Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం
- ●Horoscope | సెప్టెంబర్ 26 రాశిఫలాలు.. చేతికి అందిన లాభాలు జారిపోయే ప్రమాదం!
- ●India Moon Mission | 2040 నాటికి చంద్రుడిపై అడుగు.. ఇస్రో చీఫ్ నారాయణన్
- ●Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..

Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు

Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం

Horoscope | సెప్టెంబర్ 26 రాశిఫలాలు.. చేతికి అందిన లాభాలు జారిపోయే ప్రమాదం!






