Junior Civil Courts | తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు.. ఆమోదం తెలిపిన సర్కారు..
Junior Civil Courts | తెలంగాణలో న్యాయస్థానాలపై పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంతోపాటు సామాన్యులకు సత్వర న్యాయం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లా న్యాయస్థానాల పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Junior Civil Courts | తెలంగాణలో న్యాయస్థానాలపై పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంతోపాటు సామాన్యులకు సత్వర న్యాయం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లా న్యాయస్థానాల పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 59ను జారీ చేసింది. కొత్త జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు కల్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మొత్తం 594 కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ.. ఆర్థిక శాఖతో సంప్రదింపులు, పరిశీలన అనంతరం తొలిదశలో 200 కోర్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 2న ఆర్థిక శాఖ ఇందుకు సమ్మతి తెలిపింది. అనంతరం న్యాయ వ్యవహారాల కార్యదర్శి బీ పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డికి అత్యధికంగా 30 కోర్టులు..
కేసుల సంఖ్య అధికంగా ఉన్న పట్టణ, శివారు ప్రాంతాలకు కొత్త కోర్టుల్లో గణనీయమైన వాటా దక్కింది. రంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 30 కోర్టులు మంజూరయ్యాయి. రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు 25 కోర్టులు కేటాయించారు. మల్కాజిగిరి, ఉప్పల్, మెద్చల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో సిటీ సివిల్ కోర్టు, సెషన్స్ కోర్టు పరిధిలో 16 కొత్త కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా న్యాయ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో సబ్ డివిజన్ స్థాయిలో కొత్త కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. నల్గొండ జిల్లాకు పది, ఖమ్మంకు 8, కరీంనగర్‌కు 7, వరంగల్-హనుమకొండ జిల్లాలకు కలిపి 12 కోర్టులు మంజూరయ్యాయి. సంగారెడ్డికి 8, సూర్యాపేటకు 7, నిజామాబాద్‌కు 6, జగిత్యాలకు 6, సిద్ధిపేటకు 5, మంచిర్యాలకు 5 కోర్టులు కేటాయించారు. ఇతర జిల్లాల్లోనూ అవసరానికి అనుగుణంగా కొత్త న్యాయస్థానాలను ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో సిబ్బంది, పోస్టింగ్‌లపై ఉత్తర్వులు
కొత్త కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన సిబ్బంది నియామకాలు, న్యాయాధికారుల పోస్టింగ్‌లు, భవనాలు, మౌలిక వసతులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేక ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 200 కోర్టులు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన పరిపాలనా చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)ను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కోర్టుల ఏర్పాటుతో పెండింగ్ కేసుల పరిష్కారానికి ఊతం లభించడంతోపాటు.. జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలోనే న్యాయ సేవలు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల ప్రజలకు కోర్టు వ్యవహారాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం తగ్గనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pitru Paksha 2026 | పితృపక్షం 2026.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?
- ●Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..
- ●Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
- ●హాఫ్‌టైమ్ ముగిసింది.. కేసీఆర్ సైలెంట్ మోడ్ పార్టీకి ప్లస్సా? మైనస్సా?

Pitru Paksha 2026 | పితృపక్షం 2026.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Telangana Elections | ప్రీ ఫైనల్ పోల్స్..



