త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

10th Supplementary Exams | నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

10th Supplementary Exams | రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. శుక్ర‌వారం (జూన్ 5) నుంచి 12వ తేదీ వరకు ప‌రీక్ష‌లు జరగనున్నాయి.

G

Telangana | Published On Jun 5, 2026, 8.37 am IST

10th Supplementary Exams | నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..
Advertisement

10th Supplementary Exams | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. శుక్ర‌వారం (జూన్ 5) నుంచి 12వ తేదీ వరకు ప‌రీక్ష‌లు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 31,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. సైన్స్ పరీక్షలు (ఫిజికల్ సైన్స్, బయో లాజికల్ సైన్స్) రెండు వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వ‌హిస్తారు. విద్యార్థుల సందేహాల నివృత్తి‌కోసం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో 24 గంట‌లూ ప‌నిచేసేలా ప్ర‌త్యేక‌ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే 040-2323 0942 నంబరును సంప్ర‌దించ‌వచ్చ‌ని అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీ ప‌రీక్ష షెడ్యూల్

  • జూన్ 5- ఫ‌స్ట్ ల్యాంగ్వేజ్ (గ్రూప్ ఏ)
  • జూన్ 6- సెకెండ్ ల్యాంగ్వేజ్‌
  • జూన్ 7- థ‌ర్డ్ ల్యాంగ్వేజ్ (ఇంగ్లీష్)
  • జూన్ 8- మ్యాథ్స్‌
  • జూన్ 9- సైన్స్ పార్ట్‌1 (ఫిజిక్స్‌)
  • జూన్ 10- సైన్స్ పార్ట్‌2 (బ‌యోల‌జీ)
  • జూన్ 11- సోష‌ల్ స్ట‌డీస్‌, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్‌
  • జూన్ 12- ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2
Advertisement
Advertisement