త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..

vivo V80 | మొబైల్స్ త‌యారీ సంస్థ వివో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ వివో వి80ని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. అప్ప‌ర్ మిడ్ రేంజ్ విభాగంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ముఖ్యంగా మొబైల్ కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Oct 7, 2026, 2.11 pm IST

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
Advertisement

vivo V80 | మొబైల్స్ త‌యారీ సంస్థ వివో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ వివో వి80ని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. అప్ప‌ర్ మిడ్ రేంజ్ విభాగంలో క‌స్ట‌మ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందించారు. ముఖ్యంగా మొబైల్ కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో జైస్ కంపెనీకి చెందిన అధునాత‌న కెమెరా సెన్సార్ల‌ను ఇచ్చినందున ఫొటోలు, వీడియోలు అద్భుతంగా వ‌స్తాయి. అలాగే ఏఐ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నందున మీడియాను యూజ‌ర్లు కావ‌ల్సిన విధంగా ఎడిట్ చేసుకోవ‌చ్చు. వి సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లేనంత భారీ బ్యాట‌రీని ఇందులో అందించారు. ఈ ఫోన్‌కు మెరుగైన డ్యూర‌బిలిటీని కూడా అందించిన‌ట్లు కంపెనీ తెలిపింది.

జైస్ కెమెరాల‌తో అద్భుత‌మైన క్వాలిటీ..

ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ జైస్ నైట్ టెలిఫొటో కెమెరా ఉంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌, 3 ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 100 ఎక్స్ వ‌ర‌కు డిజిట‌ల్ జూమ్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి. పోర్ట్రెయిట్ మోడ్‌లో 10ఎక్స్ వ‌ర‌కు జూమ్ ల‌భిస్తుంది. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ జైస్ గ్రూప్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఆటో ఫోక‌స్‌, 92 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఫేషియ‌ల్ కాంటూరింగ్ అల్గారిథ‌మ్ వంటి ఫీచ‌ర్లు దీనికి ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాల స‌హాయంతో 4కె వీడియోల‌ను 60 ఎఫ్‌పీఎస్‌తో రికార్డు చేయ‌వ‌చ్చు. అలాగే మోడ్ర‌న్ మూవీ, వైబ్రెంట్‌, పాస్టెల్ అనే మూడు సినిమాటిక్ క‌ల‌ర్ ప్రొఫైల్స్‌ను కూడా అందించారు. ఈ ఫోన్‌లో కెమెరాకు తోడుగా ప‌లు ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఫీచ‌ర్ల‌ను వివో అందించింది. ఏఐ క్రియేటివ్ కెమెరాలో 30కి పైగా ప్రీసెట్ విజువ‌ల్ స్టైల్స్ ఉన్నాయి. ఏఐ దీపావ‌ళి పోర్ట్రెయిట్ 2.0తో పండుగ థీమ్‌కు అనుగుణంగా ఫొటోల‌ను తీసుకోవ‌చ్చు. ఏఐ రీట‌చ్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ను విస్త‌రించ‌వ‌చ్చు. వ‌స్తువుల‌ను తొల‌గించ‌డం, వాటి స్థానాలు మార్చ‌డం వంటి ప‌నులు చేయ‌వ‌చ్చు.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 7 జెన్ 4 ప్రాసెస‌ర్‌ను అందించారు. 7200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఉంది. దీనికి 90 వాట్ల వైర్డ్ ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. 6.59 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5కె రిజ‌ల్యూష‌న్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, హెచ్‌డీఆర్ 10 ప్ల‌స్‌, 5000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. వెనుక వైపు కోల్డ్‌-కార్వ్డ్ గ్లాస్ ఫినిష్‌, హై స్ట్రెంగ్త్ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీని క‌లిగి ఉంటుంది. ఐపీ68, 69 డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత ఆరిజిన్ ఓఎస్‌7ను ఇచ్చారు. ఫొటోలోని టెక్ట్స్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు క‌ల్పించే స్నాప్ నోట్ ఫీచ‌ర్ కూడా ఉంది. మ‌ల్టీ డివైస్ వ‌ర్క్‌ఫ్లోల కోసం వివో ఆఫీస్ కిట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది.

ధ‌ర ఎంతంటే..

8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. డ్యుయ‌ల్ సిమ్‌, ఇ-సిమ్ స‌పోర్ట్ ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే 3డి అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. వివో వి80 స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియెంట్ల‌లో, స‌న్‌రైజ్ ఆంథ‌మ్‌, హారైజ‌న్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ అనే మూడు ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.62,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.69,999గా నిర్ణ‌యించారు. 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.79,999గా ఉంది. ఈ ఫోన్‌కు ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్ల‌ను ప్రారంభించారు. అక్టోబ‌ర్ 13 నుంచి సాధార‌ణ విక్ర‌యాలు ప్రారంభం అవుతాయి. వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

లాంచ్ ఆఫర్లు సైతం..

లాంచ్ ఆఫ‌ర్ల‌లో భాగంగా నెల‌కు రూ.2625 ఈఎంఐకే ఈ ఫోన్‌ను కొనే అవ‌కాశం ఉంది. రూ.101 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చు. లేదా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్‌, కోట‌క్ మ‌హీంద్రా, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్‌, డీబీఎస్‌, బీవోబీ కార్డ్‌, యెస్ బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల కార్డుల‌తో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. వి-అప్‌గ్రేడ్ ఎక్స్‌ఛేంజ్ బోన‌స్ ద్వారా 10 శాతం వ‌ర‌కు అద‌న‌పు ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. వి-షీల్డ్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లాన్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ప్లాన్ రూ.1,134 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా ఆరు నెలల పాటు గూగుల్ వన్ 1,000జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఆన్‌లైన్ కొనుగోళ్లకు కూడా నెలకు రూ.2,625 నుంచి ఈజీ ఈఎంఐ సదుపాయం ఉంది. ఎంపిక చేసిన బ్యాంకులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్, ఒక సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఆరు నెలల పాటు గూగుల్ వన్ 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తున్నారు. ఈ ఆఫర్లు వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి.

అదనంగా వివో వి80 కొనుగోలుదారులకు త్వరలో జియోహాట్‌స్టార్ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై 50 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. రూ.499 విలువైన మొబైల్ ప్లాన్‌ను రూ.249.50కే, రూ.1,099 విలువైన సూపర్ ప్లాన్‌ను రూ.549.50కే పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement