AI Collar | పెంపుడు జంతువులతో మనుషులు మాట్లాడవచ్చా..? కొత్త డివైస్‌ను ఆవిష్కరించిన చైనీస్ స్టార్టప్..
AI Collar | పెంపుడు జంతువులను ప్రేమించే వారు చాలా సార్లు తమ కుక్కలు, పిల్లులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ సాధారణ శబ్దాలతో ఎంత ప్రయత్నించినా వాటి భావాలు పూర్తిగా అర్థం కావడం కష్టం. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని ఒక చైనీస్ స్టార్టప్ సంచలన ప్రకటన చేసింది.
Technology | Published On May 27, 2026, 12.52 pm IST
AI Collar | పెంపుడు జంతువులను ప్రేమించే వారు చాలా సార్లు తమ కుక్కలు, పిల్లులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ సాధారణ శబ్దాలతో ఎంత ప్రయత్నించినా వాటి భావాలు పూర్తిగా అర్థం కావడం కష్టం. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని ఒక చైనీస్ స్టార్టప్ సంచలన ప్రకటన చేసింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక కాలర్ ద్వారా పెంపుడు జంతువుల మాటలను మనుషుల భాషలోకి అనువదించవచ్చని ప్రకటించింది. చైనాకు చెందిన టెక్ స్టార్టప్ మెంగ్ షియోయీ కొత్త ఏఐ ఆధారిత పెట్ ట్రాన్స్‌లేటర్ ను పరిచయం చేసింది. కంపెనీ తెలిపిన ప్రకారం ఈ కాలర్ కుక్కల అరుపులు, పిల్లుల మ్యావ్ శబ్దాలు, ఇతర సంకేతాలను గుర్తించి వాటిని మనుషుల మాటలుగా మారుస్తుంది. పెంపుడు జంతువుల మెడకు ధరించే ఈ పరికరం వాటి వాయిస్, భావోద్వేగాలు, ప్రవర్తనా సంకేతాలను 95 శాతం వరకు కచ్చితత్వంతో గుర్తిస్తుందని కంపెనీ చెబుతోంది.
శాస్త్రీ నిర్దారణ అయిందా..
అయితే ప్రస్తుతం ఈ డివైస్‌లకు స్వతంత్ర ధ్రువీకరణలు లేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు థర్డ్ పార్టీ టెస్టింగ్ లేదా శాస్త్రీయ నిర్ధారణ జరగలేదు. స్టార్టప్ విడుదల చేసిన యూట్యూబ్ వీడియోలో పిల్లులు, కుక్కలు ఈ కాలర్ ధరించి కనిపించాయి. ఒక సన్నివేశంలో పిల్లి పైకి చూస్తూ మ్యావ్ అనగా, కాలర్ I wanna play అని అనువదించింది. మరో సన్నివేశంలో కుక్క మొరుగుతుండగా, I’m hungry అని డివైస్ స్పందించింది. ఇది కేవలం జంతువుల మాటలను మాత్రమే అనువదించదని, మనుషులు కూడా ఈ పరికరం ద్వారా తమ పెంపుడు జంతువులతో మాట్లాడవచ్చని పేర్కొంది. ఉదాహరణకు Easy, stay calm అని చెబితే, ఆ సందేశాన్ని కుక్కల మొరుగులు లేదా పిల్లుల శబ్దాల రూపంలో జంతువులకు చేరవేస్తుందని తెలిపింది.
ధర రూ.11వేలు..
ఆలీబాబా క్లౌడ్ రూపొందించిన క్యువెన్ ఏఐ మోడల్ ఆధారంగా ఈ ట్రాన్స్‌లేటర్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. లక్షలాది పెంపుడు జంతువుల వాయిస్ నమూనాలపై ఈ మోడల్‌కు ట్రైనింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. మైక్రోఫోన్లు, మోషన్ సెన్సర్లు, ఏఐ సిస్టమ్ ద్వారా జంతువుల శబ్దాలు, శరీర భాష, భావోద్వేగాలను విశ్లేషిస్తుందని వెల్లడించింది. ఈ కాలర్ బరువు కేవలం 27 గ్రాములే అని కంపెనీ చెబుతోంది. దీనికి కనెక్ట్ అయ్యే చిన్న వైర్‌లెస్ డివైస్ ద్వారా మనుషులు జంతువులతో కమ్యూనికేట్ చేయవచ్చని తెలిపింది. 20 కంటే ఎక్కువ భావోద్వేగాలను 95 శాతం వరకు కచ్చితత్వంతో గుర్తించగలదని కంపెనీ చెబుతోంది. ఈ కాలర్ ధరను 799 యువాన్‌లు, అంటే సుమారు రూ.11 వేలుగా నిర్ణయించారు. మే 30 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 10 వేలకుపైగా ప్రీ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
https://twitter.com/shiri_shh/status/2058352026866917406
నెటిజన్ల అనుమానాలు..
అయితే ఈ డెమో వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పలువురు యూజర్లు ఈ కాలర్ నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఒక యూజర్ 95 శాతం కచ్చితత్వం అంటున్నారు. కానీ ఇంగ్లీష్ మాట్లాడే పెంపుడు జంతువులను ధ్రువీకరించే బోర్డు ఏదైనా ఉందా? అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. మరో యూజర్.. పెట్ చెప్పలేదు, ఏఐ చెప్పింది. మరిన్ని అబద్ధాలు చెప్పడానికి ఏఐకి ఇది మంచి అవకాశం.. అంటూ కామెంట్ చేశాడు. ఇంకొందరు పెంపుడు జంతు ప్రేమికులు మాత్రం ఇలాంటి కాలర్ అవసరం లేదని పేర్కొన్నారు. నా కుక్కకు ఏం కావాలో నాకు తెలుసు. ప్రేమ, ఆహారం.. ముఖ్యంగా ఆహారం.. అని ఒకరు కామెంట్ చేశారు. మరో వ్యక్తి నా పిల్లి ఏం చెబుతుందో నాకు తెలుసు, థ్యాంక్యూ.. అంటూ స్పందించాడు.
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష



