Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
Tata Aeris | టాటా మోటార్స్ శుక్రవారం భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ఏరిస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు బుకింగ్స్ కూడా ఇవాళే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టాటా మోటార్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరల ఆధారంగా ఈ కారు ప్రారంభ ధర రూ.5.29 లక్షలుగా ఉంది.
Automobiles | Published On Sep 25, 2026, 4.57 pm IST
Tata Aeris | టాటా మోటార్స్ శుక్రవారం భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ఏరిస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు బుకింగ్స్ కూడా ఇవాళే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టాటా మోటార్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరల ఆధారంగా ఈ కారు ప్రారంభ ధర రూ.5.29 లక్షలుగా ఉంది. టాటా ఏరిస్ పెట్రోల్, ఐసీఎన్జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది. పెట్రోల్ వెర్షన్లో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 86 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఐసీఎన్జీ వెర్షన్ 75.5 పీఎస్ పవర్, 96.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐసీఎన్జీ మోడల్ కూడా మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
డిజైన్‌లో గణనీయమైన మార్పులు..
టిగోర్‌తో పోలిస్తే ఏరిస్ డిజైన్‌లో గణనీయమైన మార్పులు చేశారు. ముందు భాగంలో స్లిమ్ ఎల్ఈడీ లైటింగ్ ఎలిమెంట్లు, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్లు, కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌ను అందించారు. వెనుక భాగంలో కనెక్టెడ్ లుక్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి. క్యాబిన్‌లోనూ టాటా మోటార్స్ పలు మార్పులు చేసింది. కొత్త డ్యాష్‌బోర్డ్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. కొత్త రెండు స్పోక్ల స్టీరింగ్ వీల్ కూడా ఉంది. ఇందులో 10.24 ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అందించారు. టాటా ఏరిస్‌లో కొత్త పర్పుల్ ఎక్స్టీరియర్ రంగును అందించారు. డాండెలి డ్రిజిల్ (పర్పుల్), డేటోనా గ్రే, నైట్రో క్రిమ్సన్ (రెడ్), ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ వంటి రంగుల్లో ఈ సెడాన్ అందుబాటులో ఉండనుంది. దీంతో సంప్రదాయ రంగులతోపాటు కొత్త పర్పుల్ ఫినిష్ను ఎంచుకునే అవకాశం కొనుగోలుదారులకు ఉంటుంది.
భద్రతపై ప్రత్యేక దృష్టి..
భద్రత విషయంలోనూ ఏరిస్పై టాటా మోటార్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్‌గా అందించారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి బ్లైండ్-వ్యూ మానిటరింగ్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. పెట్రోల్ మోడల్లో స్మార్ట్ వేరియంట్ మాన్యువల్ ధర రూ.5.29 లక్షలుగా ఉంది. ప్యూర్ వేరియంట్ ధర రూ.6.14 లక్షలు కాగా, ప్యూర్ ప్లస్ ధర రూ.6.74 లక్షలు, క్రియేటివ్ వేరియంట్ ధర రూ.7.49 లక్షలుగా ఉంది. టాప్ స్పెక్ అకాంప్లిష్డ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.8.19 లక్షలుగా ఉంది. ఐసీఎన్జీ శ్రేణి స్మార్ట్ వేరియంట్ ధర రూ.6.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్యూర్ వేరియంట్ ధర రూ.7.14 లక్షలు, ప్యూర్ ప్లస్ ధర రూ.7.74 లక్షలు, క్రియేటివ్ వేరియంట్ ధర రూ.8.49 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ అకాంప్లిష్డ్ ఐసీఎన్జీ వేరియంట్ ధర రూ.9.19 లక్షలుగా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..
- ●Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Sircilla | సీఎం సిరిసిల్ల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

MLA Malla Reddy | బీజేపీ చీఫ్‌తో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్ట్రేలియా టూర్

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు 18.97 లక్షల షేర్లు..

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు - సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్






