త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM E-DRIVE | ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు స‌బ్సిడీ గ‌డువు పెంపు..

PM E-DRIVE | దేశంలోని ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ఇస్తున్న స‌బ్సిడీ గ‌డువును పొడిగించిన‌ట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద అందిస్తున్న ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడంతోపాటు దేశీయ తయారీ వ్యవస్థకు మద్దతు అందించనుంది.

S

Automobiles | Published On Aug 11, 2026, 1.04 pm IST

PM E-DRIVE | ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు స‌బ్సిడీ గ‌డువు పెంపు..
Advertisement

PM E-DRIVE | దేశంలోని ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు ఇస్తున్న స‌బ్సిడీ గ‌డువును పొడిగించిన‌ట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద అందిస్తున్న ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడంతోపాటు దేశీయ తయారీ వ్యవస్థకు మద్దతు అందించనుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పీఎం ఈ-డ్రైవ్ పథకం గడువును 2028 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ పథకానికి మొత్తం రూ.11,900 కోట్ల నిధులు కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన స్వీకరణ, ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధి, దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

2028 మార్చి 31 వ‌ర‌కు గ‌డువు పెంపు..

సవరించిన నిబంధనల ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు నమోదయ్యే అర్హత కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొనుగోలు ప్రోత్సాహకం కొనసాగుతుంది. ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే ఒక్క వాహనానికి గరిష్ఠంగా రూ.5వేలు మాత్రమే అందుతుంది. సబ్సిడీకి అర్హత కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్ఠ ఎక్స్-ఫ్యాక్టరీ ధరను రూ.1.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద గరిష్ఠంగా 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మద్దతు అందించనున్నారు. వీటి కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి మొత్తం రూ.2,767 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలైన ప్రోత్సాహకంతో పోలిస్తే ప్రస్తుతం అందుతున్న మొత్తం తగ్గింది. అప్పట్లో ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.5వేల చొప్పున, ఒక్క వాహనానికి గరిష్ఠంగా రూ.10వేల వరకు ప్రోత్సాహకం లభించింది. వాహనాల తయారీ వ్యయం తగ్గిన పరిస్థితుల్లో ప్రతి కిలోవాట్ అవర్‌కు అందించే ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉందని, అవసరాన్ని బట్టి దానిని ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంద‌ని స్పష్టం చేసింది.

క‌టాఫ్ తేదీ ఎప్పుడంటే..

అయితే ప్రోత్సాహకం నిర్ణయించిన గరిష్ఠ పరిమితికి లేదా వాహనం ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి పరిమితం అవుతుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అదే వర్తిస్తుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం నిధుల పరిమితితో కూడిన పథకమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మొత్తం పథకానికి కేటాయించిన రూ.11,900 కోట్ల నిధులకే చెల్లింపులు పరిమితం కానున్నాయి. పథకానికి లేదా దాని కింద ఉన్న ఏదైనా విభాగానికి కేటాయించిన నిధులు 2028 మార్చి 31 కంటే ముందే పూర్తయితే, సంబంధిత విభాగాన్ని ముందుగానే మూసివేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే క్లెయిమ్‌లను స్వీకరించబోమని ప్రభుత్వం తెలిపింది. పీఎం ఈ-డ్రైవ్ పథకంలోని అన్ని విభాగాలకు 2028 మార్చి 31నే తుది గడువుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లేదా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి క్లెయిమ్‌లు సమర్పించేందుకు చివరి తేదీగా 2027 డిసెంబర్ 31ని నిర్ణయించారు.

Advertisement
Advertisement