OnePlus Pad Go 2 | వన్ ప్లస్ నుంచి సరికొత్త ట్యాబ్.. ఏకంగా 10,050 ఎంఏహెచ్ బ్యాటరీతో.. 5జి సదుపాయం కూడా..!
Technology | Published On Dec 18, 2025, 10.39 am IST
సంక్షిప్త సారాంశం
వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ ప్యాడ్ గో 2 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గో సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ వన్ ప్లస్ ట్యాబ్ ఇదే కావడం విశేషం. ఈ ట్యాబ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు.
OnePlus Pad Go 2 | వన్ ప్లస్ సంస్థ వన్ ప్లస్ ప్యాడ్ గో 2 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గో సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ వన్ ప్లస్ ట్యాబ్ ఇదే కావడం విశేషం. ఈ ట్యాబ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. వన్ ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్‌లో 12.1 ఇంచుల డిస్‌ప్లేను ఇవ్వగా దీనికి 2.8కె రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. కనుక డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలను చూసేటప్పుడు అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఈ ట్యాబ్‌ను అత్యంత స్లిమ్ బెజెల్స్‌తో డిజైన్ చేశారు. కనుక దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ట్యాబ్ డిస్‌ప్లేకు 900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లభిస్తుండగా డాల్బీ విజన్ సదుపాయాన్ని కూడా ఇచ్చారు.
వన్ ప్లస్ ఫోన్‌తో కనెక్టివిటీ..
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని లాంచ్ చేశారు. ముందు, వెనుక రెండు వైపులా 8 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 16 ఇందులో లభిస్తుంది. ఈ ట్యాబ్‌ను యూజర్లు తమ వన్ ప్లస్ ఫోన్లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ట్యాబ్ లో కూడా సేమ్ వన్ ప్లస్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ట్యాబ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేయడం వల్ల రెండు డివైస్‌లను ఏకకాలంలో ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల స్క్రీన్ మిర్రరింగ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ షేరింగ్, కాల్ అండ్ నోటిఫికేషన్ సింక్, 5జి, జీపీఎస్, క్లిప్ బోర్డ్ షేరింగ్, ఫొటో గ్యాలరీ షేరింగ్ వంటి సేవలు రెండింటిలోనూ ఏకకాలంలో పనిచేస్తాయి.
భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్‌లో ఏకంగా 10,050 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయడం విశేషం. దీన్ని ఈ ట్యాబ్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీని వల్ల ఈ ట్యాబ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఎక్కువగా ఇస్తుంది. ఏకంగా 60 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ట్యాబ్‌కు 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కనుక దీన్ని వేగంగా చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ నిరంతరాయంగా 53 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను, 15 గంటల వరకు వీడియో ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఈ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియెంట్‌ను షాడో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేశారు. దీంట్లో 5జి సిమ్ వేసుకుని వాడుకోవచ్చు. అలాగే వైఫై వేరియెంట్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ట్యాబ్‌కు ప్రత్యేకంగా ఓ స్టైలస్‌ను అందిస్తున్నారు. దీనికి వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్టైలో గా నామకరణం చేశారు. ఇది యాపిల్ పెన్సిల్ లాగే పనిచేస్తుంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ చేయాలి. 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ను ఇస్తుంది. ఈ ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. కనుక సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి సదుపాయాలను ఈ ట్యాబ్‌లో అందిస్తున్నారు.
ధర ఎంతంటే..?
వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 ట్యాబ్‌ను లావెండర్ డ్రిఫ్ట్, షాడో బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.26,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.29,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 5జి మోడల్ ధర రూ.32,999గా ఉంది. ఈ మూడు ట్యాబ్ వేరియెంట్లను వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్, వన్ ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తుండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వైఫై మోడల్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 5జి మోడల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇక ఈ ట్యాబ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఈజీ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ ట్యాబ్‌ను కొన్నవారికి రూ.3,999 విలువ గల వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 స్టైలోను ఉచితంగా అందిస్తున్నారు. దీన్ని పరిమిత కాల ఆఫర్ కింద మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు. తరువాత యూజర్లు కావాలంటే దీన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






