త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Smart 4 Plus | రూ.9,999కే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్..

Lava Smart 4 Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ లావా త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ స్మార్ట్ 4 ప్ల‌స్‌ను గురువారం విడుద‌ల చేసింది. గ‌త నెల‌లో బోల్డ్ ఎన్‌2ను ఈ సంస్థ విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు.

S

Technology | Published On Jun 25, 2026, 2.47 pm IST

Lava Smart 4 Plus | రూ.9,999కే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్..
Advertisement

Lava Smart 4 Plus | మొబైల్స్ త‌యారీ సంస్థ లావా త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ స్మార్ట్ 4 ప్ల‌స్‌ను గురువారం విడుద‌ల చేసింది. గ‌త నెల‌లో బోల్డ్ ఎన్‌2ను ఈ సంస్థ విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంటుంది. అలాగే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నందున డిస్‌ప్లేపై నాణ్య‌మైన దృశ్యాలు క‌నిపిస్తాయి. ఈ ఫోన్‌లో యూనిసాక్ 9863ఎ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్‌ను క‌లిగి ఉంది. ర్యామ్‌ను అద‌నంగా మ‌రో 4జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్‌గా పెంచుకునే వీలు క‌ల్పించారు. దీంతో ఫోన్ వేగంగా ప‌నిచేస్తుంది. ల్యాగ్ ఉండ‌దు. ఇందులో ఆండ్రాయిడ్ 15 గో ఎడిష‌న్‌ను ఇచ్చారు.

భారీ బ్యాట‌రీ, డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌..

కెమెరా విష‌యానికి వ‌స్తే 13 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతోపాటు సెకండరీ ఏఐ కెమెరాను అందించారు. హెచ్‌డీఆర్, పోర్ట్రెయిట్, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ క‌లిగిన‌ బ్యాటరీని అమర్చారు. ఇది యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 10 వాట్ల ఛార్జింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో 64జీబీ స్టోరేజ్ ఉండగా, మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా మ‌రో 512జీబీ వరకు స్టోరేజ్‌ని పెంచుకోవ‌చ్చు. ఇందులో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌తోపాటు ప్రత్యేక మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. అలాగే 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4జీ వోల్టీఈ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధ‌ర వివ‌రాలు..

లావా స్మార్ట్ 4 ప్లస్ నీల‌గిరి బ్లూ, హిమాలయన్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.9,999గా నిర్ణయించారు. ఫోన్‌తోపాటు ఒక సంవత్సరం వారంటీ, ఉచిత హోమ్ సర్వీస్ సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను దేశ‌వ్యాప్తంగా ఆఫ్ లైన్ స్టోర్స్ లో విక్ర‌యిస్తున్నారు. దీనికి ప‌లు ఫైనాన్స్ స్కీమ్‌ల‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Advertisement
Advertisement