JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
JSW MG | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆగస్టు 26న భారత మార్కెట్లో కొత్త హెక్టర్ హాక్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ మోడల్, కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త అడాప్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి వాహనం కావడం విశేషం.
Automobiles | Published On Aug 7, 2026, 1.38 pm IST
JSW MG | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆగస్టు 26న భారత మార్కెట్లో కొత్త హెక్టర్ హాక్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ మోడల్, కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త అడాప్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న తొలి వాహనం కావడం విశేషం. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏంటంటే, ఒకే ఆర్కిటెక్చర్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్‌ఈవీ), స్ట్రాంగ్ హైబ్రిడ్, రేంజ్ ఎక్స్‌టెండర్ పవర్‌ట్రెయిన్‌లను రూపొందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఎంజీ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై కాకుండా, ఒకే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి అనేక ఎలక్ట్రిఫైడ్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రారంభ దశలో మాత్రం హెక్టర్ హాక్‌ను ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్లలో మాత్రమే అందించనున్నట్లు సమాచారం.
1100 కిలోమీటర్ల మైలేజ్..
హెక్టర్ హాక్ మోడల్ విదేశీ మార్కెట్లలో విక్రయిస్తున్న వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా రూపొందుతోంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన స్పై చిత్రాలు, అంతర్జాతీయ స్పెసిఫికేషన్‌ల ఆధారంగా భారత వెర్షన్‌కు సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. ఈవీ వెర్షన్‌లో 69.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దీనికి ముందు భాగంలో అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సుమారు 197 నుంచి 201 హార్స్‌పవర్ శక్తితో పాటు 310 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయనుందని అంచనా. పూర్తి ఛార్జ్‌తో సీఎల్‌టీసీ ప్రమాణాల ప్రకారం సుమారు 1100 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు 20.5 కిలోవాట్ అవర్ బ్యాటరీని జతచేయనున్నారు. ఈ పవర్‌ట్రెయిన్ కలిపి సుమారు 192 నుంచి 194 హార్స్‌పవర్ శక్తి, 230 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయనుందని సమాచారం. బ్యాటరీతో మాత్రమే సుమారు 125 కిలోమీటర్ల వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని అంచనా.
ధర ఎంత..?
పరిమాణాల విషయానికి వస్తే, హెక్టర్ హాక్ పొడవు 4,700 నుంచి 4,750 మిల్లీమీటర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. వీల్‌బేస్ సుమారు 2,800 మిల్లీమీటర్లుగా ఉండనుంది. దీంతో ఇది ప్రస్తుత హెక్టర్ కంటే పెద్దదిగా, 7 సీట్ల ఎస్‌యూవీగా ఎంజీ శ్రేణిలో స్థానం దక్కించుకోనుంది. ఫీచర్ల పరంగా 12.8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా, అలాగే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) వంటి ఆధునిక భద్రతా సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, హెక్టర్ హాక్ ప్రారంభ ధర సుమారు రూ.18 లక్షల వద్ద ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈవీ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ వంటి మోడళ్లకు పోటీగా నిలవగా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ, టాటా సఫారీ వంటి వాహనాలకు ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది.
అయితే ఈ వివరాలన్నీ ఇప్పటివరకు అంతర్జాతీయ మోడల్ స్పెసిఫికేషన్‌లు, స్పై చిత్రాలు, ప్రీ-లాంచ్ సమాచారం ఆధారంగా వచ్చిన అంచనాలే. భారత మార్కెట్‌కు సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్‌లు, ధరలు, ఫీచర్లను ఎంజీ మోటార్ ఆగస్టు 26న అధికారికంగా ప్రకటించనుంది.
సంబంధిత వార్తలు

PM E-DRIVE | పీఎం ఈ-డ్రైవ్‌లో ఈవీలకు భారీ ప్రోత్సాహం.. ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ..?
ఆగస్టు 26, 2026

PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..
ఆగస్టు 11, 2026

Xiaomi SkyNomad | షియోమీ నుంచి కొత్త ఎస్యూవీ సిరీస్ కార్లు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1700 కిలోమీటర్ల మైలేజ్..
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



