Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ధురంధర్ ఫాంట్.. రీల్స్, ఇతర కంటెంట్‌లో వాడుకోవచ్చు..
Instagram | ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ధురంధర్ స్టైల్ ఫాంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Technology | Published On Mar 27, 2026, 5.19 pm IST
Instagram | ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్లకు ధురంధర్ స్టైల్ ఫాంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. రీల్స్ క్రియేట్ చేసేందుకు వాడే ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన ఎడిట్స్ యాప్‌లో ఈ ఫాంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ధురంధర్ టైటిల్‌ను ప్రేరణగా పొంది ఈ ఫాంట్‌ను రూపొందించారు. ఈ కస్టమ్ ఫాంట్‌ను ధురంధర్ - ది రివెంజ్‌లో కనిపించే విజువల్ స్టైలింగ్ టైటిల్ ఆధారంగా తీర్చిదిద్దారు. దీన్ని క్రియేటర్లు తమ రీల్స్ లేదా ఇతర కంటెంట్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌లో ఈ కస్టమ్ ఫాంట్‌ను వాడుకోవచ్చు.
పరిమిత కాలం పాటు మాత్రమే..
ధురంధర్ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకోవడంతో చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమాల పోస్టర్లు, మ్యూజిక్, ఇతర కంటెంట్‌ను ఆధారంగా చేసుకుని రీల్స్, ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. వారు ఈ ఫాంట్‌ను వాడుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రవేశపెట్టామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఈ ఫాంట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై యూజర్లకు లభిస్తోంది. అయితే ఇది ప్రమోషనల్ ఫీచర్ కనుక కేవలం పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధురంధర్ స్టైల్ రీల్స్ లేదా ఇతర కంటెంట్‌ను క్రియేట్ చేసే క్రియేటర్లకు ఈ ఫాంట్ ఉపయుక్తంగా ఉంటుంది.
ఇలా ఉపయోగించాలి..
ఈ కొత్త ఫాంట్‌ను ఉపయోగించాలనుకుంటే యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్ యాప్‌లో సాధారణంగా తరచూ చేసే ఎడిటింగ్ విధానాన్ని పాటిస్తే సరిపోతుంది. మొదటగా ఎడిట్స్ యాప్‌ను ఓపెన్ చేసి అందులో కొత్త రీల్‌ను క్రియేట్ చేసే ప్రక్రియ ప్రారంభించాలి. తరువాత ఎడిటర్ ఇంటర్‌ఫేస్‌లో ఉన్న టెక్ట్స్ టూల్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఫాంట్ ఆప్షన్‌లలో ధురంధర్ పేరిట ఉండే ఫాంట్‌ను ఎంచుకోవాలి. తరువాత యూజర్లు తమకు కావల్సిన టెక్ట్స్‌ను పేస్ట్ చేసినా లేదా టైప్ చేసినా అదే ఫాంట్‌లో ఆ టెక్ట్స్ కనిపిస్తుంది. తరువాత కంటెంట్ లేదా వీడియోను క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయవచ్చు. లేదా ఇతరులకు షేర్ చేయవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






