Hero Splendor Flex Fuel | ఇండియాలో తొలి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ బైక్స్ లాంచ్ చేసిన హీరో.. ఇక పెట్రోల్ టెన్షన్ ఫ్రీ
హీరో మోటోకార్ప్ ఇండియాలో తొలిసారిగా 85% ఇథనాల్‌తో నడిచే స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను లాంచ్ చేసింది. మైలేజ్, ఫీచర్లు తెలుసుకోండి.
Automobiles | Published On Jun 4, 2026, 4.34 pm IST
Hero Splendor Flex Fuel | త్రినేత్ర.న్యూస్ : దేశీయ బైక్స్ దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్‌దీప్ సింగ్ పూరీల సమక్షంలో.. ఇండియాలోనే మొట్టమొదటి కమ్యూటర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్స్ 'స్ప్లెండర్ ప్లస్' (Splendor+ Flex Fuel), 'హెచ్ఎఫ్ డీలక్స్' (HF Deluxe Flex Fuel) లను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. సామాన్యులు ఎక్కువగా వాడే 100cc సెగ్మెంట్‌లో ఈ టెక్నాలజీ రావడం ఇదే తొలిసారి.

పెట్రోల్ కాదు.. ఇథనాల్‌తో పరుగు
ఈ కొత్త బైక్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇవి కేవలం పెట్రోల్‌తోనే కాకుండా E20 నుంచి E85 వరకు ఇథనాల్ బ్లెండ్ (85% ఇథనాల్, 15% పెట్రోల్) తో కూడా నడుస్తాయి. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ముడిచమురు దిగుమతులపై మన దేశం ఆధారపడటం తగ్గడంతో పాటు, విపరీతమైన కాలుష్యానికి కూడా చెక్ పెట్టొచ్చు.

ధర ఎంతంటే.. డెలివరీలు ఎప్పటినుంచి?
హీరో కొత్త 'హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్' ధర రూ. 72,792 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, 'స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్' ధర రూ. 82,710 గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే వీటి ధర కొద్దిగా (ప్రీమియం) ఎక్కువే అయినప్పటికీ.. ఇంధన ఖర్చుల పరంగా భవిష్యత్తులో చాలా లాభం చేకూరుతుంది. జూలై 2026 నుంచి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ముందుగా ఈ బైక్స్ డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇంజిన్ అప్‌గ్రేడ్స్ అండ్ కొత్త ఫీచర్లు
ఈ రెండు బైక్స్‌లోనూ హీరో తమ నమ్మకమైన 97.2cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే ఉపయోగించినప్పటికీ, అత్యధిక ఇథనాల్ బ్లెండ్స్‌ను సపోర్ట్ చేసేలా దీనిలో కీలకమైన మార్పులు చేశారు. కొత్త ECU కాలిబ్రేషన్, స్పెషల్ ఫ్యూయల్ పంప్, సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్ వంటివి పొందుపరిచారు. E85 ఫ్యూయల్‌తో నడిచినప్పుడు ఈ బైక్స్ 8,000rpm వద్ద 8.57bhp పవర్‌ను, 6,000rpm వద్ద 8.3Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. డైలీ యూజ్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు.

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో హీరో పేటెంటెడ్ i3S (ఐడిల్-స్టాప్-స్టార్ట్) టెక్నాలజీ, కొత్త డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. సరికొత్త బ్లాక్ అండ్ లైమ్-ఎల్లో కలర్ గ్రాఫిక్స్‌తో (graphics) ఇవి చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో జైపూర్‌లోని హీరో 'సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)'లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ బైక్స్‌ను డెవలప్ చేశారు. అత్యధికంగా అమ్ముడయ్యే స్ప్లెండర్ లాంటి ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని తీసుకురావడం ద్వారా, సాధారణ రైడర్లకు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను (alternative fuel vehicles) మరింత చేరువ చేసినట్లయింది.
View this post on Instagram
తాజావార్తలు
- ●Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..
- ●Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక
- ●Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ - ఒప్పుకొని... తప్పుకోవడంపై అనుమానాలు?
- ●NEET Aspirant | మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..
- ●Harish Rao | పోలవరం పూర్తయితే భద్రాచలానికి నిత్యం జలగండమే: హరీశ్‌రావు
- ●Mallu Ravi | పేదలకు ఇండ్లు కట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మల్లు రవి కౌంటర్

Stock Markets | ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాలతో మొదలై భారీగా రికవరీ..

Gutha Sukhender Reddy | ముందు నీ భాష మార్చుకో.. పవన్ కల్యాణ్‌కు మండలి చైర్మన్ చురక

Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ - ఒప్పుకొని... తప్పుకోవడంపై అనుమానాలు?

NEET Aspirant | మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..



