Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
Samsung Galaxy Tab S12 | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్‌లో రెండు నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌లను లాంచ్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ట్యాబ్ ఎస్12 అల్ట్రా పేరుతో ఈ డివైస్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. అలాగే లాంచింగ్ ఆఫర్లు, శాంసంగ్ కేర్ ప్లస్ ప్లాన్లు, గెలాక్సీ ఫరెవర్ కార్యక్రమాన్ని కూడా శాంసంగ్ అందిస్తోంది.
Technology | Published On Oct 2, 2026, 3.47 pm IST
Samsung Galaxy Tab S12 | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్‌లో రెండు నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌లను లాంచ్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ట్యాబ్ ఎస్12 అల్ట్రా పేరుతో ఈ డివైస్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. అలాగే లాంచింగ్ ఆఫర్లు, శాంసంగ్ కేర్ ప్లస్ ప్లాన్లు, గెలాక్సీ ఫరెవర్ కార్యక్రమాన్ని కూడా శాంసంగ్ అందిస్తోంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రాలో 14.6 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, గెలాక్సీ బ్యాట్ ఎస్12 ప్లస్‌లో 12.6 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇవి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. ఔట్‌డోర్‌లో గరిష్టంగా 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తాయి. అందువల్ల ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. రెండింటిలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఫోర్ చానల్ స్పేషియల్ ఆడియో, ఎర్గోనామిక్ ఎస్ పెన్ లను కూడా ఇచ్చారు.
23 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
ఈ ట్యాబ్‌లు ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వన్ యూఐ9 ఓఎస్‌తో పనిచేస్తాయి. మల్టీ విండో, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను ఇచ్చారు. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రాను ఒక్కసారి చార్జ్ చేస్తే 23 గంటల వరకు, ట్యాబ్ ఎస్12 ప్లస్ 21 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు మోడల్స్‌కు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. భారత్‌లో గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రా, గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్ ట్యాబ్‌లు అక్టోబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, భాగస్వామ్య స్టోర్లు, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభ్యం కానున్నాయి.
ధరలు ఎంత..
గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ వైఫై వేరియెంట్ మోడల్ ధర రూ.1,49,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,69,999గా ఉంది. ఇదే మోడల్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సెల్యులార్ వేరియెంట్ ధర రూ.1,64,999 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ సెల్యులార్ వేరియెంట్ ధర రూ.1,84,999గా ఉంది. గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వైఫై మోడల్ ధర రూ.1,29,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,999గా ఉంది. ఇందులోనే సెల్యులార్ మోడల్స్ ధరలు వరుసగా రూ.1,44,999, రూ.1,64,999గా ఉన్నాయి. ఇక గెలాక్సీ ట్యాబ్ ఎస్12 అల్ట్రా కోసం ప్రొ కీబోర్డ్ కవర్‌ను రూ.27,999కు అందిస్తుండగా, గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్ కోసం ధర రూ.26,499గా ఉంది.
లాంచింగ్ ఆఫర్లు..
లాంచ్ ఆఫర్‌లలో భాగంగా రూ.5వేల వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.5వేల వరకు అప్‌గ్రేడ్ బోనస్ ఇస్తారు. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, జడ్ ఫ్లిప్ 8, ఎస్26 అల్ట్రా, ఎస్26 ప్లస్, ఎస్25 అల్ట్రా, ఎస్25 ప్లస్‌తో కలిపి ఈ ట్యాబ్‌లను కొనుగోలు చేస్తే రూ.15వేల వరకు కాంబో డిస్కౌంట్ లభిస్తుంది. ట్యాబ్‌తోపాటు గెలాక్సీ బడ్స్4 లేదా బడ్స్ 4 ప్రొను కొనుగోలు చేస్తే 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ప్రొ కీబోర్డు కవర్‌పై 30 శాతం తగ్గింపు ధరను ఇస్తారు. ఎంపిక చేసిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ భాగస్వాముల ద్వారా 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. శాంసంగ్ కేర్ ప్లస్ ప్రొటెక్ట్ మ్యాక్స్ కింద పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఫరెవర్ కార్యక్రమంలో రూ.12,499తో చేరవచ్చు. ఇందులో భాగంగా 13 నెలల లోపు ట్యాబ్‌ను వెనక్కి ఇస్తే డివైస్ ధరలో 40 శాతం బైబ్యాక్ విలువ ఇస్తారు. 14 నుంచి 24 నెలల వరకు అయితే డివైస్ ధరలో 25 శాతం బైబ్యాక్ చెల్లిస్తారు.
తాజావార్తలు
- ●Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!

Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు



