త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

e VITARA | మారుతి సుజుకి ఇ-విటారా కార్ల‌కు భారీగా డిమాండ్‌.. మ‌రిన్ని మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తామ‌న్న కంపెనీ..

e VITARA | దేశీయ కార్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన విస్తరణను వేగవంతం చేస్తోంది. 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి వెల్లడించారు.

S

Automobiles | Published On Apr 12, 2026, 1.35 pm IST

e VITARA | మారుతి సుజుకి ఇ-విటారా కార్ల‌కు భారీగా డిమాండ్‌.. మ‌రిన్ని మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తామ‌న్న కంపెనీ..
Advertisement

e VITARA | దేశీయ కార్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన విస్తరణను వేగవంతం చేస్తోంది. 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకున్న మారుతి సుజుకి, ఒకే రోజులో 108 యూనిట్ల e VITARA కార్ల‌ను వినియోగదారులకు అందజేసింది. ఈ హ్యాండోవర్ కార్యక్రమం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతోందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. స్వ‌చ్ఛ‌మైన‌ మొబిలిటీ వైపు మారుతున్న దిశలో ఇది కీలక అడుగుగా ఆయన పేర్కొన్నారు.

మ‌రో 4 కొత్త ఎల‌క్ట్రిక‌ల్ కార్ మోడ‌ల్స్‌..

త‌మ సంస్థ ప్రణాళికలో భాగంగా 2031 నాటికి త‌మ‌ పోర్ట్‌ఫోలియోలో మరో 4 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నామ‌ని, మార్కెట్‌లోని అన్ని విభాగాల్లో తాము పాల్గొంటామ‌ని, అవసరమైన అన్ని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయన మీడియాకు తెలిపారు. 2031 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (BEV) విభాగంలో కూడా మారుతి సుజుకి నంబర్ వన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప‌శ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావంపై స్పందిస్తూ ముడి సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన ధరలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధరల పెంపు తప్పద‌ని, అయితే ఎంత మేరకు పెంచుతామో త్వరలో ప్రకటిస్తామ‌ని ఆయన చెప్పారు.

గ‌తేడాదిలో 4.50 ల‌క్ష‌ల వాహ‌నాల ఎగుమ‌తి..

గత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి సుమారు 4.50 లక్షల వాహనాలను ఎగుమతి చేసిందని బెనర్జీ పేర్కొన్నారు. ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉందని అన్నారు. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ తయారీ కేంద్రంలో ప్రత్యేకంగా ఉత్ప‌త్తి అవుతున్న‌ e VITARA గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు 25వేల‌కు పైగా యూనిట్ల‌ను 44 దేశాలకు ఎగుమతి చేశారు. వీటిని 100కు పైగా దేశాలలో విక్ర‌యించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి, విశ్వసనీయంగా, విస్తృతంగా అందుబాటులోకి తేవ‌డానికి 2030 నాటికి దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు..

ఇప్పటికే దేశవ్యాప్తంగా 2వేల‌కు పైగా మారుతి సుజుకి ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. అలాగే వినియోగదారులకు పూర్తి భరోసా కల్పించేందుకు 1.50 లక్షల మంది శిక్షణ పొందిన సిబ్బందితో EV-సిద్ధమైన సర్వీస్ వర్క్‌షాప్‌లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. e VITARA దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్న మారుతి సుజుకి తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం అని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement