Maruti Suzuki | కార్లపై మారుతి సుజుకి భారీ ఆఫర్లు.. ఆ కార్‌పై ఏకంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్..
Maruti Suzuki | దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ మారుతి సుజుకి ఇన్విక్టోపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎంఫీవీ మోడల్ అసలు టొయోటా ఇన్నోవా హైక్రాస్ట్ కు బ్యాడ్జ్-ఇంజినీర్డ్ వెర్షన్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ మొత్తం రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.
Technology | Published On Apr 29, 2026, 2.21 pm IST
Maruti Suzuki | దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ మారుతి సుజుకి ఇన్విక్టోపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎంఫీవీ మోడల్ అసలు టొయోటా ఇన్నోవా హైక్రాస్ట్ కు బ్యాడ్జ్-ఇంజినీర్డ్ వెర్షన్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ మొత్తం రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ (అన్వయించే చోట్ల), లాయల్టీ అప్‌గ్రేడ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. ఈ ఆఫర్లు కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇన్విక్టో ధర రూ.24.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ప్రస్తుతం ఇది మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన మోడల్ గా పేరుగాంచింది.
ఇన్విక్టో ఫీచర్లు..
ఇన్విక్టోలో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించారు. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు టయోటా 5వ జనరేషన్ SHEV (స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్) సిస్టమ్ ఉంది. ఇది గరిష్టంగా 184 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పీక్ టార్క్ 188Nm కాగా, ఎలక్ట్రిక్ మోటార్ టార్క్ 206Nm ఉంటుంది. ఈ సిస్టమ్ ను ఇ-డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో జత చేశారు. ARAI ప్రకారం ఇన్విక్టో కారు ప్రతి లీటర్‌కు 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఎంఫీవీ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, LED టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. డ్రైవర్‌కు 8-వే పవర్డ్ సీట్ మెమరీ ఫంక్షన్‌తో వస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ కలర్ MID, పవర్డ్ టెయిల్‌గేట్, ప్యానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇతర కార్ల మోడళ్లపైనా..
ఇన్విక్టో Bharat NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32లో 30.43 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49లో 45 పాయింట్లు పొందింది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (హిల్ హోల్డ్ అసిస్ట్‌తో), అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్స్, ISOFIX మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-డిస్క్ బ్రేక్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. ఇన్విక్టోతో పాటు నెక్సా శ్రేణిలోని ఇతర కార్లపై కూడా కంపెనీ ఆఫర్లు అందిస్తోంది. మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.50వేల వరకు, బలెనోపై రూ.40వేలు, ఫ్రాంక్స్‌పై రూ.55వేలు, గ్రాండ్ విటారా రూ.1.07 లక్షలు, సుజుకి జిమ్నీపై రూ.50వేలు, సుజుకి ఎక్స్ఎల్6పై రూ.50వేల వరకు ఆఫర్లను ఇస్తున్నారు. ప్రీమియం ఎంఫీవీ కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఇన్విక్టోపై వచ్చిన ఈ భారీ ఆఫర్లు మంచి అవకాశంగా మారాయి. హైబ్రిడ్ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లు, మంచి మైలేజ్ అన్నీ కలిపి ఈ వాహనం మార్కెట్లో వాహనదారులను ఆకట్టుకుంటోంది.
సంబంధిత వార్తలు

Cruise Control Feature | కార్లలో ఉండే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. ఇప్పుడు టూవీలర్లలోనూ.. టాప్ 5 మోడల్స్ ఇవే..
మే 4, 2026

Gemini AI In Cars | ఇక కార్లలోనూ జెమిని ఏఐ.. మరింత సులభతరం కానున్న ప్రయాణం..
మే 1, 2026

e VITARA | మారుతి సుజుకి ఇ-విటారా కార్లకు భారీగా డిమాండ్.. మరిన్ని మోడల్స్‌ను లాంచ్ చేస్తామన్న కంపెనీ..
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



