త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో ఎల్ నినో ముప్పును కోవిడ్ తరహా విపత్తుగా ప్రభుత్వం భావిస్తోంది. సాగు, తాగునీరు, కరెంటు కష్టాలు మరో 9 నెలలు తప్పవని తేల్చింది. పూర్తి వివరాలు ఇవే.

J

Telangana | Published On Oct 15, 2026, 7.00 pm IST

Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

సంక్షిప్త సారాంశం

ఎల్ నినో (El Nino) సంక్షోభంపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిని మరో 'కోవిడ్ తరహా ముప్పు'గా అభివర్ణిస్తూ ప్రజలను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడింది. సాగు విస్తీర్ణం 30 శాతం తగ్గి రూ. 20 వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లడంతో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరాలని నిర్ణయించింది. యాసంగికి సాగునీరు ఇవ్వలేమని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేయడంతో అనధికారికంగా 'క్రాప్ హాలిడే' (Crop Holiday) అమలవుతోంది. అక్టోబర్‌లోనే హైదరాబాద్‌లో వేసవి స్థాయిలో వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. విద్యుత్ డిమాండ్ 19,900 మెగావాట్లకు చేరడం, బొగ్గు కొరత నేపథ్యంలో వచ్చే వానాకాలం (మరో 9 నెలలు) వరకు నీరు, కరెంటు పొదుపు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Advertisement
  • ఇది కోవిడ్ లాంటి ముప్పే
  • పొదుపు తప్ప మార్గమే లేదు
  • తాగునీటికైనా..సాగునీటికైనా ఇంకో 9 నెలలు భరించాల్సిందే
  • బొగ్గు కొరతతో కరెంటు కోతలు తప్పవు
  • పొదుపు తప్ప వేరే మార్గం లేదు
  • యాసంగికి నీళ్లివ్వలేమని ఇప్పటికే చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • అనధికారికంగా అమలవుతున్న క్రాప్ హాలిడే
  • మరింత ఆందోళనకరంగా మారనున్న వేసవి
  • ప్రజలందరికీ అవగాహన కల్పించాలంటూ
  • అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
  • కోవిడ్ తరహా ప్రణాళికకు రంగం సిద్ధం
  • రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

Telangana El Nino Crisis | త్రినేత్ర న్యూస్ : ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రజలను ఊరడించే పనిలో పడింది. ప్రత్యామ్నాయాలేవీ కలిసి రాకపోవడంతో చేసేదేమీ లేక.. ఎల్ నినో కష్టాలపై జనానికి అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నది. గత కొన్ని రోజులుగా అటు మంత్రిత్వ శాఖలు..ఇటు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న అన్ని సమీక్షల సారాంశం ఒక్కటే...ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కి దిగజారింది. ఇది మరో కోవిడ్ తరహా ముప్పు..అని ప్రచారం చేయనున్నది. ప్రజలే పెద్ద మనసు చేసుకొని కరువు ను ఎదుర్కోవాలని చెప్పనున్నది. ఈ మేరకు అవగాహనకు చెందిన ప్రణాళిక సిద్ధమవుతున్నది.

20 వేల కోట్ల మేర పంట నష్టం

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 30 శాతం తగ్గిపోయింది. దీంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర పభావం పడింది. ఈ మేరకు శాసన సభలో తీర్మానం చేసి..20వేల కోట్ల సాయాన్ని కేంద్రాన్ని అడగనున్నది. మరోవైపు అటు గోదావరి, ఇటు కృష్ణ జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బంది నెలకొంటున్నది. హైదరాబాద్ నగరంలో ..అక్టోబర్ నెలలో కూడా వేసవిలో అవసరమైనన్ని జలమండలి ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతున్నది.

కళాజాతలు..గ్రామసభలు..

యాసంగి పంటలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు విన్నవించారు. వచ్చే వేసవిలో తాగునీటిని సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలోనే.. దసరా పండుగ పూర్తైన వెంటనే.. ఊరి ఊరినా ఎల్ నినోపై ముప్పుపై ప్రజలందరికీ సంపూర్థ అవగాహన కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్ తరహా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని కోరారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా.. ప్రతి ఊరిలోనూ కళాజాతలు, గ్రామ సభలు నిర్వహించాలని కోరింది..

వచ్చే వానాకాలం వరకు.. తప్పదంతే

ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సాహసం చేయలేకపోతున్నా.. గ్రామాల్లో కరెంటు కోతలు ఎప్పుడో మొదలయ్యాయి. రైతులు పంపుసెట్లను నిరంతరం వాడుతుండడం వల్ల విద్యుత్ డిమాండ్ 19,900 మెగావాట్లకు పెరిగింది. వ్యవసాయానికి ఇచ్చే త్రీ-ఫేజ్ కరెంట్ సరఫరా కొన్ని జిల్లాల్లో 8 గంటల కంటే తక్కువకు పరిమితం కావడం, లో-వోల్టేజీ సమస్యల వల్ల పంపు మోటార్లు కాలితున్నాయి. కాగా, ఓపెన్ మార్కెట్‌లో విద్యుత్ లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎంత ఖర్చయినా సరే విద్యుత్ కొనుగోలు చేసి నిరంతర సరఫరా అందించడానికి ప్రయత్నిస్తున్నా.. అంత సులువుగా లభ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం.. వచ్చే వానకాలం వరకు ఈ కష్టాలు తప్పవని ప్రజలకు పరిస్థితిని అర్థం చేయించాలని సిద్ధమైంది.

Advertisement
Advertisement