Ponguleti Srinivas Reddy | వరంగల్ హాస్పిటల్లో దసరా నుంచి సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Ponguleti Srinivas Reddy | వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుత్రిలో దసరా నుంచే సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలు ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుత్రిలో దసరా నుంచే సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలు ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. మళ్లీ ఈనెల 17న పనులను పరిశీలిస్తామని పేర్కొన్నారు. గురువారం మంత్రి సీతక్కతో కలిసి ఆస్పత్రిని కలియతిరిగి పరిశీలించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు.
గత ప్రభుత్వం నిర్మించి తలపెట్టి అసంపూర్తిగా వదిలేసిన ఈ ఆసుపత్రిని ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించడం జరిగింది. నిరంతర పర్యవేక్షణ వలన పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. నిర్మాణ పనులు తుది దశకు చేరుకుని చిన్న చిన్న పనులు మినహా సేవలకు సిద్దంగా ఉన్నఈ ఆసుపత్రిని ఈ అక్టోబర్ 20 తేది అంటే దసరా రోజున సాఫ్ట్ లాంచ్ ద్వారా ఓపి సేవలను ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి.
డిసెంబర్ నాటికి..
గత ప్రభుత్వం కేవలం కాగితాల మీదనే ఆర్డర్ల ఇచ్చి వైద్యాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఎలాంటి బేషజాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ పోతుంది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సుమారు 5000 వరకు వచ్చే ఉండే అవకాశం ఉంది. వరంగల్ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలకు రాబోయే రోజుల్లో ఈ ఎంజీఎం ఆసుపత్రి ద్వారా అత్యంత అధునాతనమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రజల నమ్మకం మరింత బలపడే విధంగా అందుకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ వైద్యానికి ప్రజా పెద్దపీట వేస్తుంది అని పొంగులేటి పేర్కొన్నారు.
మంత్రి వెంట ఎంపీలు వేం. నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఎల్.నాగరాజు, KUDA చైర్ పర్సన్ గుండు సుధారాణితో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు.
సంబంధిత వార్తలు

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
అక్టోబర్ 15, 2026

Harish Rao | రేవంత్! నీ వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉంది
అక్టోబర్ 15, 2026

Telangana El Nino All Party Meeting | తెలంగాణపై ‘ఎల్ నినో’ ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్
- ●KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
- ●TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల
- ●Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం
- ●Harish Rao | రేవంత్! నీ వల్ల 3 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉంది
- ●Telangana El Nino All Party Meeting | తెలంగాణపై 'ఎల్ నినో' ప్రభావం: రేపు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్

KTR Letter to Revanth Reddy | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపండి.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

TTD January 2027 Quota Release Dates | తిరుమల భక్తులకు అలర్ట్: 2027 జనవరి నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల

Sreeleela | శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీకి తొలగిన అడ్డంకులు - రిలీజ్ మరింత ఆలస్యం







