త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Change GMail Address | జీమెయిల్ యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఇక‌పై మీ మెయిల్ ఐడీని ఎడిట్ చేసుకోవ‌చ్చు..!

Change GMail Address | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇప్ప‌టికే అనేక సేవ‌ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తున్న విష‌యం విదిత‌మే. జీమెయిల్‌, మ్యాప్స్‌, డ్రైవ్‌, యూట్యూబ్ ఇలా అనేక గూగుల్ సేవ‌లు యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది.

S

Technology | Published On Dec 26, 2025, 10.39 am IST

Change GMail Address | జీమెయిల్ యూజ‌ర్ల‌కు అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఇక‌పై మీ మెయిల్ ఐడీని ఎడిట్ చేసుకోవ‌చ్చు..!
Advertisement

Change GMail Address | టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇప్ప‌టికే అనేక సేవ‌ల‌ను యూజ‌ర్ల‌కు అందిస్తున్న విష‌యం విదిత‌మే. జీమెయిల్‌, మ్యాప్స్‌, డ్రైవ్‌, యూట్యూబ్ ఇలా అనేక గూగుల్ సేవ‌లు యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లోనూ ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. దీంతో యూజ‌ర్లు ఈ సేవ‌ల‌ను చాలా సుల‌భంగా ఉప‌యోగించుకోగలుగుతున్నారు. కాగా గూగుల్ త‌న జీమెయిల్ సేవ‌ల్లో భాగంగా మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు అందించ‌నుంది. ఈ ఫీచ‌ర్‌ను ఇప్ప‌టికే బీటా ద‌శ‌లో టెస్ట్ చేస్తుండ‌గా అతి త్వ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. దీని వ‌ల్ల జీమెయిల్ యూజ‌ర్లు త‌మ పాత ఐడీల‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది.

జీమెయిల్‌ను 10 ఏళ్ల‌కు పైగా ఉప‌యోగిస్తున్న యూజ‌ర్లు త‌కపై త‌మ మెయిల్ ఐడీల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా ఒక‌సారి ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేస్తే దాన్ని మార్చ‌లేం. ఎప్ప‌టికీ అలాగే వాడాల్సి ఉంటుంది. కానీ ఈ-మెయిల్ ఐడీని ఎడిట్ చేసి యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన‌ట్లు మార్చుకునే విధంగా ఓ ఫీచ‌ర్‌ను జీమెయిల్‌లో అందించ‌నున్నారు. దీన్ని ఇప్ప‌టికే ప‌లువురు యూజర్ల‌తో టెస్ట్ చేస్తున్నారు. జీమెయిల్‌లో చేంజ్ జీమెయిల్ అడ్ర‌స్ పేరిట ఓ ప్ర‌త్యేక సెక్ష‌న్ కొంద‌రు ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు కేవ‌లం 3 సార్లు మాత్ర‌మే త‌మ మెయిల్ ఐడీని ఎడిట్ చేసుకుని మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అది కూడా ఒక్కో మార్పుకు ఏడాది పాటు క‌చ్చిత‌మైన వ్య‌వ‌ధి ఉంటుంది. ఒక‌సారి మెయిల్ ఐడీని ఎడిట్ చేసి మార్చుకుంటే మ‌ళ్లీ ఏడాది వ‌ర‌కు దాన్ని ఎడిట్ చేయ‌లేరు. అలా మ‌రో 2 చాన్సులు ఉంటాయ‌న్న‌మాట‌. ఇక 10 ఏళ్ల‌కు పైగా జీమెయిల్ ఐడీని వాడుతున్న‌వారికి మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. అలాగే ఈ-మెయిల్ ఐడీని ఎడిట్ చేసి మార్చాక పాత మెయిల్ ఐడీ కూడా ప‌నిచేస్తుంది. కానీ లాగిన్ మాత్రం కొత్త ఐడీతో కావాల్సి ఉంటుంది. ఇక పాత ఐడీకి కూడా ఎప్ప‌టిలాగే మెయిల్స్ వ‌స్తాయి. కానీ లాగిన్ మాత్రం ప‌నిచేయ‌దు. ఇలా ఒక్కో యూజ‌ర్‌కు 3 సార్లు ఈ-మెయిల్ ఐడీని ఎడిట్ చేసి మార్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అయితే ఈ ఫీచ‌ర్ ఎప్ప‌టినుంచి అందుబాటులోకి రానుంది అనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే గూగుల్ వెల్ల‌డించనుంద‌ని స‌మాచారం.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement