Low Speed Electric Two Wheelers | లో స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారీ మార్పులు..? వేగం పెంచనున్నారా..?
Low Speed Electric Two Wheelers | దేశంలో తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (లో-స్పీడ్ ఈవీలు) నిబంధనల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్) కింద ప్రస్తుతం అమల్లో ఉన్న 250 వాట్ల మోటార్ పవర్ పరిమితి, 60 కిలోల అన్లాడెన్ వెయిట్ పరిమితిని పెంచే అంశంపై ఆటోమోటివ్ టెస్టింగ్, సర్టిఫికేషన్ సంస్థలు సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Automobiles | Published On Jun 9, 2026, 11.40 am IST
Low Speed Electric Two Wheelers | దేశంలో తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (లో-స్పీడ్ ఈవీలు) నిబంధనల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్) కింద ప్రస్తుతం అమల్లో ఉన్న 250 వాట్ల మోటార్ పవర్ పరిమితి, 60 కిలోల అన్లాడెన్ వెయిట్ పరిమితిని పెంచే అంశంపై ఆటోమోటివ్ టెస్టింగ్, సర్టిఫికేషన్ సంస్థలు సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే గరిష్ట వేగ పరిమితి అయిన గంటకు 25 కిలోమీటర్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంవీఆర్ నిబంధనల ప్రకారం 250 వాట్ల మోటార్ శక్తి, 60 కిలోల బరువు, గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితిలో ఉండే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మోటార్ వాహనాలుగా పరిగణించరు. అందువల్ల వీటికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వంటి నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తోంది. తక్కువ ఖర్చుతో, సులభమైన రవాణా సౌకర్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ మార్గాన్ని ప్రభుత్వం రూపొందించింది.
పరిమితులు పెంచాలని ఒత్తిడి..
అయితే కాలక్రమేణా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా మారడంతో ప్రస్తుత నిబంధనలపై పునఃసమీక్ష అవసరం ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో 16-17 ఏళ్ల యువతకు గంటకు 25 కిలోమీటర్ల వేగ పరిమితితో, గరిష్టంగా 1,500 వాట్ల మోటార్ కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను చట్టబద్ధంగా నడిపేందుకు అనుమతించే ప్రతిపాదనపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. మరోవైపు క్విక్ కామర్స్, హైపర్ లోకల్ డెలివరీ సేవల విస్తరణతో నగర ప్రాంతాల్లో లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీగా వినియోగంలోకి వచ్చాయి. ఫ్లీట్ ఆపరేటర్లు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తుండటంతో ప్రస్తుతం ఉన్న నిబంధనలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. అయితే అమలు పరంగా కొన్ని కీలక ఆందోళనలు కూడా ఉన్నాయి. 250 వాట్లు, 25 కిలోమీటర్ల పరిమితుల్లో టైప్ అప్రూవల్ పొందిన వాహనాలను తర్వాత ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్లు, బ్యాటరీలతో మార్పులు చేసి 40-55 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న ఘటనలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) గతంలో రాష్ట్రాలను హెచ్చరించింది.
లో స్పీడ్ ఈవీలకు అధిక స్పీడ్ మోటార్లు బిగింపు..
కేరళలో 2023లో మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో కొంతమంది డీలర్లు రిజిస్ట్రేషన్ అవసరం లేని స్కూటర్లలో 1,000 వాట్ల మోటార్లు అమర్చినట్లు గుర్తించారు. అయినప్పటికీ వాటిని రిజిస్ట్రేషన్ మినహాయింపు వాహనాలుగానే విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకే ఆర్టీవో పరిధిలో ప్రభుత్వానికి సుమారు రూ.100 కోట్ల పన్ను నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ముంబై రవాణా శాఖ కూడా గిగ్ వర్కర్లు వినియోగిస్తున్న రిజిస్ట్రేషన్ లేని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై చర్యలు ప్రారంభించింది. ప్రమాదాల సమయంలో రైడర్లను గుర్తించడం కష్టమవుతోందని, భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం సాంకేతిక పరిమితులను సడలించాలంటే అమలు వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలకు చట్టబద్ధత లభించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
కేంద్రం ముందు రెండు మార్గాలు..
ప్రస్తుత నిబంధనలు మోటార్ పవర్, వాహనం బరువు, గరిష్ట వేగం అనే మూడు అంశాల సమతుల్య కలయిక ఆధారంగా అమలులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వేగ పరిమితిని మార్చకుండా కేవలం పవర్, బరువు పరిమితులను పెంచడం వల్ల విధాన లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మార్గాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మొదటిది ప్రస్తుత మినహాయింపు వర్గాన్ని కొనసాగిస్తూ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధించడం. రెండోది సాంకేతిక పరిమితులను సడలించినప్పటికీ హెల్మెట్ తప్పనిసరి చేయడం, వాణిజ్య అవసరాలకు వినియోగించే వాహనాలకు సరళమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, అలాగే మినహాయింపు పొందిన లో-స్పీడ్ ఈవీలు, పూర్తి స్థాయి టైప్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య స్పష్టమైన గుర్తింపు వ్యవస్థను అమలు చేయడం. అయితే కేంద్రం ఏ మార్గాన్ని అనుసరిస్తుందో చూడాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Old Chetaks | పాతకాలం నాటి చేతక్ స్కూటర్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో.. 80 కిలోమీటర్ల మైలేజ్..
మే 3, 2026

Zelio E-Mobility 2026 Gracy Scooter | రూ.60వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అక్కర్లేదు..
ఏప్రిల్ 25, 2026

Ola S1 X Plus 5.2 kWh | ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం
- ●Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ - రామ్‌చరణ్ అదరగొట్టేశాడు - పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
- ●Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
- ●Apache Helicopter Gunship | హర్మూజ్ సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్
- ●OTT | ఓటీటీలోకి అక్షయ్‌కుమార్ లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ - పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయే దయ్యం కథ
- ●Gold And Silver Prices Today | బలపడుతున్న సెంటిమెంట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

DK Shivakumar | సగం కొరికిన యాపిల్స్‌ను జనంపైకి విసిరిన సీఎం డీకే శివకుమార్.. నెట్టింట దుమారం

Allu Arjun | మైండ్‌బ్లోయింగ్ మూవీ - రామ్‌చరణ్ అదరగొట్టేశాడు - పెద్ది మూవీకి అల్లు అర్జున్ రివ్యూ

Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు

Apache Helicopter Gunship | హర్మూజ్ సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్



