BYD Electric | BYD ఎలక్ట్రిక్ అద్భుతం.. 9 నిమిషాల్లోనే కార్ ఫుల్ చార్జ్.. 630 కిలోమీటర్ల మైలేజ్..
BYD Electric | చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా నిర్వహించిన బీజింగ్ ఆటో షో 2026లో తన నెక్ట్స్ జనరేషన్ అట్టో 3 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. చైనాలో యువాన్ ప్లస్ పేరుతో విక్రయాలు ప్రారంభం కానున్న ఈ మోడల్, గరిష్టంగా 630 కిలోమీటర్ల సీఎల్టీసీ రేటెడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.
Automobiles | Published On Apr 27, 2026, 12.26 pm IST
BYD Electric | చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా నిర్వహించిన బీజింగ్ ఆటో షో 2026లో తన నెక్ట్స్ జనరేషన్ అట్టో 3 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. చైనాలో యువాన్ ప్లస్ పేరుతో విక్రయాలు ప్రారంభం కానున్న ఈ మోడల్, గరిష్టంగా 630 కిలోమీటర్ల సీఎల్టీసీ రేటెడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే కొత్త ఫ్లాష్ ఛార్జింగ్ సిస్టమ్‌తో బ్యాటరీని 10 నుంచి 97 శాతం వరకు కేవలం సుమారు 9 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చని తెలిపింది. ఈ అప్డేటెడ్ అట్టో 3 ముందుభాగంలో షార్ప్ డిజైన్, స్కల్ప్ట్ చేసిన బంపర్, సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కొత్త 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. వెనుక భాగంలో ఫ్లోటింగ్ రూఫ్ గ్రాఫిక్, అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, అలాగే ఇల్యూమినేటెడ్ బీవైడీ లోగోను అమర్చడం ద్వారా ప్రీమియం లుక్ వచ్చింది.
పెరిగిన పరిమాణం, అదనపు పోర్టులు..
కొత్త అట్టో 3 పరిమాణాల్లో కూడా పెరిగింది. దీని పొడవు 4,665 మిల్లీమీటర్లు, వెడల్పు 1,895 మిల్లీమీటర్లు, ఎత్తు 1,675 మిల్లీమీటర్లు. ఇది ప్రస్తుత ఇండియా స్పెక్ మోడల్‌తో పోలిస్తే 210 మిల్లీమీటర్లు పొడవుగా, 20 మిల్లీమీటర్లు వెడల్పుగా, 60 మిల్లీమీటర్లు ఎత్తుగా ఉంది. వీల్‌బేస్ 2,770 మిల్లీమీటర్లు, ఇది 50 మిల్లీమీటర్లు ఎక్కువ. దీంతో లోపలి స్థలం మెరుగుపడి 750 లీటర్ల బూట్ స్పేస్‌తోపాటు అదనంగా 180 లీటర్ల ఫ్రంక్ కూడా అందుబాటులో ఉంది. ఇంటీరియర్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ముందరి ప్రయాణికుడి సీటుకు అదనపు రిక్లైనింగ్ సౌకర్యం, అలాగే థర్మోఎలక్ట్రిక్ హీటెడ్, కోల్డ్ స్టోరేజ్ బాక్స్ ఉన్నాయి. పానోరమిక్ గ్లాస్ రూఫ్, 256 కలర్ అంబియంట్ లైటింగ్, 16 స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 60 వాట్ యూఎస్బీ టైప్ సి వంటి హై స్పీడ్ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. దీంతో ప్రయాణ అనుభవం మరింత మెరుగుపడుతుంది.
ఫుల్ చార్జితో 630 కిలోమీటర్ల మైలేజ్..
చైనా వాహనదారుల కోసం ఈ మోడల్ లైడార్ సహాయంతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ సూట్‌ను కూడా అందిస్తుంది. ఇది డ్రైవర్ అసిస్టెన్స్, సేఫ్టీ ఫీచర్లను మరింత విస్తరించనుంది. బీవైడీ ఈ మోడల్‌ను రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందించనుంది. 57.54 కిలోవాట్ అవర్, 68.54 కిలోవాట్ అవర్. ఇవి కంపెనీ రెండవ తరం బ్లేడ్ బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మాణమయ్యాయి. చిన్న బ్యాటరీతో 540 కిలోమీటర్ల రేంజ్, పెద్ద బ్యాటరీతో గరిష్టంగా 630 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఈ బ్యాటరీలు వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినిస్తాయి. ఇది చిన్న సైజు బ్యాటరీతో 272 హెచ్‌పీ, పెద్ద సైజు బ్యాటరీతో 327 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సెటప్‌తో ఈ మోడల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే BYDకి చెందిన పలు ఎలక్ట్రిక్ కార్లు భారత్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మోడల్‌ను ఇక్కడ రిలీజ్ చేయడంపై ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక చైనాలో లభ్యం కానున్న మోడల్స్ ధరలను కూడా ప్రకటించలేదు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’
- ●CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
- ●ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
- ●Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!
- ●Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
- ●Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు

స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

Punjab Assembly Elections 2027 | పంజాబ్ ఎన్నికల సర్వే: 'ఆప్'కే మళ్లీ చాన్స్.. కానీ ఆ ఒక్క తప్పే కొంపముంచొచ్చు!






