Maruti Suzuki | మళ్లీ మారుతీ సుజుకినే టాప్.. 2025 ఎగుమతుల్లో రికార్డు
2025 లో భారత్ నుంచి 18 మోడల్స్ కార్లను 100 దేశాలకు మారుతీ సుజుకి ఎగుమతి చేసింది. అలాగే.. భారత్‌లో 2025 లో 2,351,139 కార్లను సేల్ చేసింది. అందులో ఎగుమతి చేసిన కార్లు 3,95,648 యూనిట్లు. దేశంలో కార్ల సేల్స్ ప్రతి సంవత్సరం 36.5 శాతం పెరుగుతూ వస్తోంది.
Technology | Published On Jan 1, 2026, 6.56 pm IST
Maruti Suzuki | మారుతీ సుజుకి కార్లు అంటేనే మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కారు. మారుతీ సుజుకి కార్లకు భారత్‌లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే కంపెనీ భారత్‌లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్లను కూడా ప్రారంభించి సంవత్సరానికి 2.6 మిలియన్ల మారుతీ సుజుకి కార్లను భారత్‌లో తయారు చేస్తోంది. భారత్ నుంచి చాలా దేశాలకు ఈ కార్లను ఎగుమతి కూడా చేస్తోంది. 2025 సంవత్సరంలో భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన కార్లలో మారుతీ సుజుకి కార్లు టాప్ ప్లేస్‌ని ఆక్రమించాయి. 2025 లో 3.95 లక్షల మారుతీ సుజుకి కార్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. మరే కార్ల కంపెనీ కూడా ఇన్ని కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మారుతీ సుజుకి కార్లకు ఉన్న డిమాండ్ అటువంటిది మరి. 3.95 లక్షల కార్లను ఎగుమతి చేసి 21 శాతం గ్రోత్‌ని కంపెనీ పెంచుకుంది. గత ఐదేళ్లుగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న కార్లలో మారుతీ సుజుకినే టాప్ పొజిషన్‌ను దక్కించుకుంటూ వస్తోంది. 2025 లోనూ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్లు, ఈ విటారా కార్లను కూడా ఎగుమతి చేయడాన్ని సుజుకి ప్రారంభించింది.
100 దేశాలకు 18 మోడల్స్ కార్లు ఎగుమతి
2025 లో భారత్ నుంచి 18 మోడల్స్ కార్లను 100 దేశాలకు మారుతీ సుజుకి ఎగుమతి చేసింది. అలాగే.. భారత్‌లో 2025 లో 2,351,139 కార్లను సేల్ చేసింది. అందులో ఎగుమతి చేసిన కార్లు 3,95,648 యూనిట్లు. దేశంలో కార్ల సేల్స్ ప్రతి సంవత్సరం 36.5 శాతం పెరుగుతూ వస్తోంది.
ఒక సంవత్సరంలో 3.95 లక్షల యూనిట్లను ఎగుమతి చేయడం అనేది కంపెనీకే గర్వకారణం. భారత్‌లో కార్ల మ్యానుఫాక్చరింగ్‌కి ఉన్న సత్తా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా మారుతీ సుజుకి కార్లపై కస్టమర్లకు ఉన్న నమ్మకమే ఈ ఎగుమతులకు నిదర్శనం. ఈ సంవత్సరం 21 శాతం గ్రోత్‌ని పెంచి దేశ ఎగుమతి రంగ వృద్ధిలో తాము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. అంటూ మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈవో హిశాషి టకెచి హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





