Bajaj Pulsar | బజాజ్ పల్సర్ కొనేవారికి శుభవార్త.. రూ.7వేల వరకు బెనిఫిట్స్ పొందే వీలు..
Bajaj Pulsar | బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే పలు ఎంపిక చేసిన పల్సర్ వాహనాలపై కంపెనీ ఏకంగా రూ.7వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
Technology | Published On Jan 7, 2026, 8.00 am IST
Bajaj Pulsar | బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే పలు ఎంపిక చేసిన పల్సర్ వాహనాలపై కంపెనీ ఏకంగా రూ.7వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పల్సర్ వాహనాన్ని ప్రవేశపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 25 ఇయర్స్ ఆఫ్ పల్సర్ సెలబ్రేషన్ పేరిట కస్టమర్లకు ఓ ఆఫర్‌ను అందిస్తున్నామని బజాజ్ తెలియజేసింది. ఇందులో భాగంగా పలు ఎంపిక చేసిన పల్సర్ మోడల్స్‌పై కస్టమర్లు రూ.7వేల వరకు క్యాష్ బెనిఫిట్స్‌ను పొందవచ్చు. మరిన్ని వివరాలకు కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న బజాజ్ డీలర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో ఏయే పల్సర్ మోడల్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉందో తెలుస్తుంది. దాని ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేసి ఆ మేర ప్రయోజనాలను పొందవచ్చు. నగదు సేవింగ్స్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 5 కాంప్లిమెంటరీ సర్వీస్‌లు వంటి ప్రయోజనాలను ఈ ఆఫర్ కింద అందిస్తున్నారు.
పరిమిత కాలం పాటు మాత్రమే..
ఇక ఈ ఆఫర్‌ను పరిమిత కాలం పాటు మాత్రమే అందిస్తున్నామని బజాజ్ తెలిపింది. దీనికి ముగింపు తేదీ అంటూ లేదు. కనుక కస్టమర్లు క్యాష్ బెనిఫిట్ పొందాలంటే స్టాక్ అయిపోయే లోపు వాహనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా 2026 నూతన సంవత్సరం సందర్భంగా బజాజ్ కంపెనీ పలు పల్సర్ మోడల్స్‌కు గాను ఈ ఏడాది వేరియెంట్లను లాంచ్ చేసింది. పల్సర్ 220ఎఫ్‌ను ఇటీవలే మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.28 లక్షలుగా ఉంది. ఈ వాహనానికి ఈసారి ప్రత్యేకంగా బాడీ గ్రాఫిక్స్‌ను మార్చి అందిస్తున్నారు. అలాగే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను ఇచ్చారు. ఇక 2026 పల్సర్ 150 మోడల్‌ను కూడా గతేడాది మోడల్‌తో పోలిస్తే చాలా రకాలుగా డిజైన్లను మార్చారు. వినియోగదారులు ఈ మోటార్ సైకిల్‌కు చెందిన బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బీజ్, గ్రీన్ లైట్ కాపర్ కలర్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.
పల్సర్ శ్రేణిలో సమూలంగా మార్పులు..
అయితే ఈ ఏడాదిలో పల్సర్ వాహనాల శ్రేణిలో సమూల మార్పులు తీసుకువచ్చి వాహనాల డిజైన్, ఫీచర్లను బజాజ్ కంపెనీ పూర్తిగా మార్చనుంది. ఈ క్రమంలోనే కొత్త మోడల్స్‌ను ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఆ సమయంలోనే పండుగ ఆఫర్లతో ఈ నూతన మోడల్స్‌ను లాంచ్ చేయనున్నారు. పల్సర్ 125, పల్సర్ 150 మోడల్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాగా పల్సర్ వాహనాలు ప్రారంభం నుంచి వినియోగదారుల ఆదరణను చూరగొన్నాయి. బజాజ్‌కు చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న టూ వీలర్స్‌లో పల్సర్ వాహనాలు మొదటి వరుసలో ఉన్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





