E20 vs E100 | E20 పెట్రోల్ ఎఫెక్ట్: మైలేజ్ తగ్గి లబోదిబోమంటున్న ఓనర్లు.. మరోవైపు దేశంలోనే ఫస్ట్ E100 బైక్ ఎంట్రీ
ఒకవైపు E20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ పడిపోయి ఓనర్లు లబోదిబోమంటుంటే.. మరోవైపు 100% ఇథనాల్‌తో నడిచే తొలి E100 బైక్ జూన్ 3న లాంచ్ కానుంది!
Technology | Published On May 28, 2026, 6.22 pm IST
E20 vs E100 | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 (20% ఇథనాల్, 80% పెట్రోల్) ఇంధనం.. పాత వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. రోజురోజుకూ పడిపోతున్న మైలేజ్ (Mileage), పెరుగుతున్న ఇంజన్ రిపేర్లతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో, ఆటోమొబైల్ రంగాన్ని మరో మలుపు తిప్పుతూ.. దేశంలోనే మొట్టమొదటి 100% ఇథనాల్‌తో నడిచే 'E100' బైక్‌ను జూన్ 3న లాంచ్ చేసేందుకు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సిద్ధమైంది. పాత బండ్ల కష్టాలేంటి? కొత్తగా వస్తున్న E100 టెక్నాలజీ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
సగం బండ్ల మైలేజ్ ఢమాల్
2023కి ముందు కొనుగోలు చేసిన పెట్రోల్ వాహనాల్లో E20 పెట్రోల్ వాడకం వల్ల జరుగుతున్న నష్టంపై 'లోకల్ సర్కిల్స్' (LocalCircles) దేశవ్యాప్తంగా ఒక భారీ సర్వే నిర్వహించింది. దాదాపు 301 జిల్లాల నుంచి 50 వేల మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. గత 9 నెలలుగా తమ వాహనం మైలేజ్ దారుణంగా పడిపోయిందని ప్రతి ఇద్దరిలో ఒకరు (50%) వాపోయారు. ఇక 29% మంది వాహనదారులు.. అసాధారణ స్థాయిలో వాహనం విడిభాగాలు పాడవుతున్నాయని, ఇంజన్, ఫ్యూయల్ ట్యాంక్ (Fuel tank), కార్బొరేటర్ రిపేర్లకు వస్తున్నాయని రిపోర్ట్ చేశారు.
మైలేజ్ డ్రాప్ కేవలం 1-6% మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నా, ట్రాఫిక్ ఉండే సిటీల్లో వాస్తవ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఫ్యూయల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని మిడిల్ క్లాస్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంజన్లు ఎందుకు పాడవుతున్నాయి?
గత 15 ఏళ్లలో అమ్ముడైన 80% వాహనాలు E5 లేదా E10 (10% ఇథనాల్) బ్లెండెడ్ ఇంధనానికి మాత్రమే సూట్ అయ్యేలా డిజైన్ చేయబడ్డాయి. కానీ, ఇప్పుడు బంకుల్లో ఎక్కడ చూసినా E20 పెట్రోల్ డీఫాల్ట్‌గా మారిపోయింది. ఇథనాల్‌కు తేమను (Moisture) గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల పాత వాహనాల్లోని రబ్బర్, ప్లాస్టిక్ పార్ట్స్ త్వరగా పాడైపోతాయి. ఇంజన్ త్వరగా హీట్ ఎక్కడం (Overheating), కోల్డ్ స్టార్ట్ ట్రబుల్స్, యాక్సిలరేషన్ తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పాత బండ్లకు కష్టాలు.. 'ఫ్లెక్స్ ఫ్యూయల్'తో లాభాలు
ఒకవైపు పాత బండ్లు కేవలం 20% ఇథనాల్‌ను కూడా తట్టుకోలేక మోరాయిస్తుంటే, ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఏకంగా 100% ఇథనాల్ ఇంధనానికి సపోర్ట్ చేసే 'ఫ్లెక్స్ ఫ్యూయల్' (Flex Fuel) ఇంజన్ల వైపు మొగ్గుచూపుతున్నాయి.
సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ రేటు తక్కువగా ఉండటం వల్ల సామాన్యుడికి ఇంధన ఖర్చుల భారం భారీగా తగ్గుతుంది. ఈ క్రమంలోనే దేశంలోనే తొలి E100 బైక్‌ను హీరో మోటోకార్ప్ జూన్ 3న అధికారికంగా మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త బైక్ పేరు ఏమిటనేది కంపెనీ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచింది.

ఇప్పటికే హీరో సంస్థ తన పాపులర్ మోడల్స్ అయిన HF డీలక్స్, స్ప్లెండర్లకు ఫ్లెక్స్ ఫ్యూయల్ అనుమతులు తెచ్చుకోగా, సుజుకి జిక్సర్ SF 250 (Suzuki Gixxer SF 250), హోండా CB 300F మోడల్స్ E85 (85% ఇథనాల్) సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాత బండ్ల టెక్నాలజీతో ఎదురవుతున్న సమస్యలకు.. ఈ అడ్వాన్స్‌డ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఖచ్చితంగా చెక్ పెట్టనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





