త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BMW Recall | 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్.. అగ్నిప్రమాద ముప్పుపై హెచ్చరిక..

BMW Recall | జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కీలక నిర్ణయం తీసుకుంది. వాటర్ పంప్ ఎలక్ట్రికల్ కనెక్టర్‌లో లోపం కారణంగా అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో 7,20,796 కార్లను రీకాల్ చేస్తోంది. ప్రభావిత కార్ల యజమానులు వాహనాలను భవనాలకు దూరంగా బయట పార్క్ చేయాలని అధికారులు సూచించారు.

S

Technology | Published On Nov 16, 2026, 1.00 pm IST

BMW Recall | 7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్.. అగ్నిప్రమాద ముప్పుపై హెచ్చరిక..
Advertisement

BMW Recall | జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కీలక నిర్ణయం తీసుకుంది. వాటర్ పంప్ ఎలక్ట్రికల్ కనెక్టర్‌లో లోపం కారణంగా అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో 7,20,796 కార్లను రీకాల్ చేస్తోంది. ప్రభావిత కార్ల యజమానులు వాహనాలను భవనాలకు దూరంగా బయట పార్క్ చేయాలని అధికారులు సూచించారు.

స‌మ‌స్య ఎందుకు వ‌చ్చింది..?

బీఎండబ్ల్యూ కార్లలోని వాటర్ పంప్ ఎలక్ట్రికల్ కనెక్టర్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) విడుదల చేసిన భద్రతా నివేదిక ప్రకారం, కాలక్రమేణా కనెక్టర్‌లోని మెటీరియల్ దెబ్బతినడం వల్ల తేమ వాటర్ పంప్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి వేడెక్కడం, అరుదైన సందర్భాల్లో అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ సమస్య కారణంగా మొత్తం 7,20,796 వాహనాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఏయే మోడ‌ల్స్‌కు ముప్పు ఉంది..?

ఈ రీకాల్ పరిధిలో 2014-2016 మోడల్ బీఎండబ్ల్యూ 228ఐ, 228ఎక్స్‌ఐ, 2012-2016 మోడల్ 328ఐ, 328ఎక్స్‌ఐ, 2014-2016 మోడల్ 428ఐ, 428ఎక్స్‌ఐ, 2012-2016 మోడల్ 528ఐ, 528ఎక్స్‌ఐ, 2012-2015 మోడల్ ఎక్స్1, 2013-2017 మోడల్ ఎక్స్3, 2015-2018 మోడల్ ఎక్స్4, 2016-2018 మోడల్ ఎక్స్5, 2012-2016 మోడల్ జ‌డ్4 కార్లు ఉన్నాయి. గతంలో 24వి608 రీకాల్‌లో భాగంగా మరమ్మత్తులు చేయించుకున్న వాహనాలు కూడా మళ్లీ ఈ సమస్యకు సంబంధించి మరమ్మత్తులు చేయించుకోవాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ స్పష్టం చేసింది.

కారు యజమానులు ఏం చేయాలి?

అగ్నిప్రమాద ముప్పు నేపథ్యంలో ప్రభావిత వాహనాలను ఇళ్లు, ఇతర భవనాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయాలని అధికారులు సూచించారు. ఈ సమస్యకు సంబంధించి మరమ్మత్తుల విధానాన్ని ఇంకా నిర్ణయించలేదు. డిసెంబర్‌లో వాహన యజమానులకు అధికారిక నోటిఫికేషన్ లేఖలు పంపించనున్నారు. మరిన్ని వివరాల కోసం బీఎండబ్ల్యూ కస్టమర్లు 1-800-525-7417 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement