త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyundai | హ్యుందాయ్‌ కార్లకు భారీ రీకాల్‌.. అగ్ని ప్రమాద ముప్పు..

Hyundai | అమెరికాలో అగ్ని ప్రమాద ముప్పు కారణంగా 94,622 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించింది. వాహనాలు పార్క్‌ చేసిన సమయంలో లేదా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా ఆటోమొబైల్‌ భద్రతా నియంత్రణ సంస్థ వెల్లడించింది.

S

Technology | Published On Oct 17, 2026, 11.35 am IST

Hyundai | హ్యుందాయ్‌ కార్లకు భారీ రీకాల్‌.. అగ్ని ప్రమాద ముప్పు..
Advertisement

Hyundai | అమెరికాలో అగ్ని ప్రమాద ముప్పు కారణంగా 94,622 కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు హ్యుందాయ్‌ ప్రకటించింది. వాహనాలు పార్క్‌ చేసిన సమయంలో లేదా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అమెరికా ఆటోమొబైల్‌ భద్రతా నియంత్రణ సంస్థ వెల్లడించింది. హ్యుందాయ్‌ మోటార్‌ అమెరికా సంస్థకు చెందిన 94,622 వాహనాల్లో ముందు వైపు పవర్‌ సీట్లకు సంబంధించిన మోటార్లు అధికంగా వేడెక్కే అవకాశం ఉందని అమెరికా జాతీయ రహదారి ట్రాఫిక్‌ భద్రతా పరిపాలనా సంస్థ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) తెలిపింది.

ఈ మోడ‌ళ్ల‌కు రీకాల్‌..

పవర్‌ సీటును నియంత్రించే స్విచ్‌ ఒకే స్థితిలో ఇరుక్కుపోవడం వల్ల ముందు సీటు మోటార్లు అధికంగా వేడెక్కుతాయ‌ని అధికారులు వివరించారు. దీనివల్ల కారు పార్క్‌ చేసి ఉన్నా, నడుపుతున్నా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ రీకాల్‌ పరిధిలో 2015-2016 సంవత్సరాలకు చెందిన కొన్ని హ్యుందాయ్‌ జెనెసిస్‌ కార్లు, 2017-2020 మధ్య తయారైన జెనెసిస్‌ జీ80 మోడళ్లు ఉన్నాయి. వాహనాల యజమానులు మరమ్మత్తులు పూర్తయ్యే వరకు కార్లను బహిరంగ ప్రదేశాల్లో, ఇతర వాహనాలు లేదా భవనాలకు దూరంగా పార్క్‌ చేయాలని హ్యుందాయ్‌ సూచించినట్లు ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ వెల్లడించింది. దీనివల్ల అగ్ని ప్రమాదం సంభవించినా ఇతర వాహనాలు, నిర్మాణాలకు ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మరమ్మత్తు విధానాన్ని హ్యుందాయ్‌ అభివృద్ధి చేస్తోందని ఆటోమొబైల్‌ భద్రతా నియంత్రణ సంస్థ తెలిపింది. రీకాల్‌కు గురైన వాహనాల్లో నిడెక్‌ మొబిలిటీ కొరియా కార్పొరేషన్‌ సరఫరా చేసిన ముందు పవర్‌ సీటు నియంత్రణ స్విచ్‌లు ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ అంశంపై వివరణ కోరగా నిడెక్‌ స్పందించలేదని రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

Advertisement
Advertisement