Ather Konarc | రూ.99,999కే ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 200 కి.మీ రేంజ్..
Ather Konarc | ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ కొనార్క్ ను శనివారం నిర్వహించిన వార్షిక కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.99,999గా నిర్ణయించింది. దీంతో కంపెనీ తొలిసారిగా భారీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న మాస్ మార్కెట్ విభాగంలోకి అడుగుపెట్టింది.
Automobiles | Published On Aug 29, 2026, 2.13 pm IST
Ather Konarc | ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ కొనార్క్ ను శనివారం నిర్వహించిన వార్షిక కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.99,999గా నిర్ణయించింది. దీంతో కంపెనీ తొలిసారిగా భారీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న మాస్ మార్కెట్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఏథర్ కొనార్క్ ధర రూ.99,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్‌ను వివిధ రేంజ్ ఆప్షన్లలో అందించనున్నారు. 100 కిలోమీటర్ల రేంజ్ కలిగిన వేరియంట్ ధర రూ.99,999 ఉండగా, 125 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.1,21,999గా ఉంది. ఈ రెండు వేరియంట్లు సెప్టెంబర్‌లో లభ్యం కానున్నాయి. అంతకంటే ఎక్కువ రేంజ్ అందించే 161 కిలోమీటర్ల వేరియంట్‌ను రూ.1,44,999 ధర పరిధిలో తీసుకురావాలని ఏథర్ నిర్ణయించింది. అలాగే 200 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్ను 2027 మూడో త్రైమాసికంలో తీసుకురానుంది.
కొత్తగా వచ్చిన ఈఎల్ ప్లాట్‌ఫామ్..
ఏథర్ ఉత్పత్తుల రోడ్‌మ్యాప్‌లో కొనార్క్ జడ్ కూడా ఉంది. ఇందులో 125 కిలోమీటర్లు, 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్లు 2027 రెండో త్రైమాసికంలో రానున్నాయి. కొనార్క్ ఏథర్ కొత్త తరం ఈఎల్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన తొలి ఉత్పత్తి స్కూటర్. వాహనాల వైవిధ్యం, ఉత్పత్తి సామర్థ్యం, తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో వివిధ విభాగాల్లో ఏథర్ తీసుకురానున్న ఉత్పత్తులకు ఇదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉండనుంది. కొనార్క్తో ఏథర్ తన ఉత్పత్తుల పరిధిని 450, రిట్జా సిరీస్‌లకు మించి విస్తరిస్తోంది. తద్వారా సాధారణ వినియోగదారులతో పాటు విస్తృత స్థాయి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. స్పోర్టీ లుక్‌తో ఉండే 450 సిరీస్‌తో పోలిస్తే కొనార్క్ను మరింత సంప్రదాయ, కుటుంబ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

పోటీ స్కూటర్లు ఇవే..
కొనార్క్ ధర ఏథర్ సొంత రిట్జా కంటే తక్కువగా ఉండటంతో పాటు టీవీఎస్, బజాజ్ మార్కెట్లోని ప్రధాన విభాగాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. రూ.99,999 ప్రారంభ ధరతో ఉన్న కొనార్క్ స్కూటర్.. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ సి2501 ధరలకు దాదాపు సమానంగా ఉంది. అయితే 125 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్ రూ.1,21,999 ధరతో ఏథర్ రిట్జా ఎస్‌కు చాలా దగ్గరగా ఉంది. రిట్జా ఎస్ ప్రారంభ ధర రూ.1,21,499గా ఉంది. ధరతో పోలిస్తే రేంజ్ కొనార్క్కు ప్రధాన ప్రత్యేకతగా మారనుంది. 100 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్కు బజాజ్ చేతక్ సి2501 అందించే 113 కిలోమీటర్లు, ప్రారంభ ఐక్యూబ్ అందించే 114 కిలోమీటర్లతో పోలిస్తే స్పష్టమైన రేంజ్ ప్రయోజనం కనిపించడం లేదు. అయితే 144 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ఎక్కువ సామర్థ్యం కలిగిన ఐక్యూబ్, చేతక్ వేరియంట్లకు దగ్గరగా ఉండటంతో పాటు ఏథర్ ప్రీమియం 450 సిరీస్ కంటే తక్కువ ధరలో ఉండనుంది.
వచ్చే ఏడాదిలో మరిన్ని మోడల్స్..
ఏథర్ భవిష్యత్ ఉత్పత్తుల రోడ్‌మ్యాప్ కూడా కీలకంగా మారింది. ప్రారంభ కొనార్క్తో కంపెనీ ఆగిపోవడం లేదు. 2027 మూడో త్రైమాసికానికి 200 కిలోమీటర్ల రేంజ్ కలిగిన కొనార్క్ను కంపెనీ విడుదల చేయనుంది. అలాగే కొనార్క్ జడ్లో 125, 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్లను 2027 రెండో త్రైమాసికానికి ప్రకటించింది. దీన్ని బట్టి ఈఎల్ ప్లాట్‌ఫామ్ కేవలం ఒక మాస్ మార్కెట్ స్కూటర్ కోసం మాత్రమే కాకుండా భవిష్యత్‌లో విస్తృత ఉత్పత్తుల కుటుంబానికి పునాదిగా మారనున్నట్లు తెలుస్తోంది. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ ప్రారంభ దశ వినియోగదారులను దాటి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్ మార్కెట్ స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు ఏథర్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా వెల్లడించారు.

విస్తృత స్థాయి ఫీచర్లు..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో మార్పులను దృష్టిలో ఉంచుని మంచి స్కూటర్‌కు అవసరమైన సాంకేతికత, వాహన నిర్మాణ వ్యవస్థలపై ఏథర్ ఎన్నో సంవత్సరాలుగా పెట్టుబడులు పెడుతోందని ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో ఏథర్ కొన్ని సందర్భాల్లో కాలానికి ముందుగానే, మరికొన్ని సందర్భాల్లో ప్రారంభ దశ వినియోగదారుల కోసం వాటిని అందించిందని చెప్పారు. టెక్నాలజీ, ఫీచర్లు విస్తృత స్థాయి వినియోగదారులకు ఉపయోగకరంగా మారుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇప్పుడు ప్రధాన మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రీసేల్ ధర నుంచి సర్వీసింగ్ సమయం వరకు, గుంతలున్న రోడ్లపై సౌకర్యం నుంచి వాటిని ముందుగానే గుర్తించి తప్పించుకునే సాంకేతికత వరకు, సులభమైన ఛార్జింగ్ నుంచి అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ వరకు అన్ని అంశాలను ఎలక్ట్రిక్ వాహనాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వాహన భద్రతను స్పష్టంగా తెలియజేసే ఫీచర్లు, ఛార్జింగ్ సౌకర్యం, సాఫ్ట్వేర్ ఆధారిత భద్రతా వ్యవస్థలు కూడా వినియోగదారుల అనుభవంలో కీలకంగా మారనున్నాయని ఆయన తెలిపారు.
ఈఎల్ ప్లాట్‌ఫామ్ పునాది..
ఈఎల్ ప్లాట్‌ఫామ్‌ను ఏథర్ తొలిసారిగా 2025 కమ్యూనిటీ డే కార్యక్రమంలో ప్రదర్శించింది. అదే కార్యక్రమంలో రెడక్స్ కాన్సెప్ట్ వాహనం, తదుపరి తరం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఏథర్‌స్టాక్ 7.0ను కూడా కంపెనీ పరిచయం చేసింది. 450 ప్లాట్‌ఫామ్ తర్వాత ఏథర్ రూపొందించిన తొలి పూర్తి కొత్త వాహన నిర్మాణ వ్యవస్థ ఈఎల్ ప్లాట్‌ఫామ్ కాగా వివిధ మార్కెట్ విభాగాలకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించడంతో పాటు తయారీ సామర్థ్యాన్ని పెంచేలా దీన్ని రూపొందించారు. తమ లక్ష్య మార్కెట్ పరిధిని విస్తరించేందుకు, అధిక పరిమాణంలో విక్రయించే విభాగాల్లో వృద్ధి సాధించేందుకు ఈఎల్ ప్లాట్‌ఫామ్ కీలకంగా ఉంటుందని ఏథర్ భావిస్తోంది. కొనార్క్తో పాటు ఏథర్ కమ్యూనిటీ డే 2026లో టెక్నాలజీ, ఛార్జింగ్, వినియోగదారుల యాజమాన్య అనుభవానికి సంబంధించిన మరిన్ని కొత్త పరిణామాలను కంపెనీ ప్రదర్శించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gutta Sukhendar Reddy | చిన్నారెడ్డి చేసింది తప్పు.. కొండా సురేఖను తప్పిస్తేనే బెటర్
- ●RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘటన జరిగితే మేడిపల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాదవ్ ఏం పాపం చేసిండు?
- ●Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
- ●Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో మరోసారి అంతరాయం
- ●Yellamma Movie | ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది - దేవీశ్రీప్రసాద్‌కు జోడీగా మ్యాడ్ బ్యూటీ!
- ●IPO | ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారంలో ముగియనున్న ముఖ్యమైన ఐపీవోలు ఇవే..

Gutta Sukhendar Reddy | చిన్నారెడ్డి చేసింది తప్పు.. కొండా సురేఖను తప్పిస్తేనే బెటర్

RS Praveen Kumar | జూబ్లీహిల్స్‌లో సంఘటన జరిగితే మేడిపల్లిలో కేసు ఎట్ల బుక్ అయింది.. ముత్తుయాదవ్ ఏం పాపం చేసిండు?

Rahul Gandhi | శుద్ధీకరణ కూడా ఓ రకమైన వివక్షే.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో మరోసారి అంతరాయం






